YS Sharmila: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. నాన్న..తనను ప్రేమించినంతగా ఎవర్ని ప్రేమించలేదని..ఈ ప్రపంచంలో తాను నాన్నను ఆరాదించినట్లుగా ఎవరు ఆరాధించి ఉండరన్నారు. ఓ ప్రభుత్వం పెట్టిన పేరును..మరో ప్రభుత్వం ఆ పేరును తొలగిస్తే అవమాన పరిచినట్లేనని స్పష్టం చేశారు. ఆ పెద్ద మనిషిని అవమానిస్తే కోట్ల మంది ప్రజలను అవమాన పరిచినట్లేనన్నారు.
ఇప్పుడు వైఎస్ఆర్ పేరు పెడతారు..రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్ పేరు మార్చే అవకాశం ఉందని..అప్పుడు ఆయనను సైతం అవమానించినట్లే కదా అని అన్నారు. ఒకరి ఖ్యాతిని తీసుకుని వైఎస్ఆర్కి ఆ ఖ్యాతిని ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. వైఎస్ఆర్కి ఉన్న ఖ్యాతి ప్రపంచంలోనే ఎవరికీ లేదన్నారు. వైఎస్ఆర్ చనిపోతే ఆ బాధ తట్టుకోలేక 7 వందల మంది చనిపోయారని..అలాంటి ఖ్యాతి ఉన్న వైఎస్ఆర్కి ఇంకొకరి ఖ్యాతి అవసరం లేదని తేల్చి వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల చెప్పారు.
విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. దీనికి ఇటీవల ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీనిపై పెను దుమారం కొనసాగుతోంది. పేరు మార్చడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఆ పార్టీ అధినేత అధినేత చంద్రబాబు కలిసి ఫిర్యాదు చేశారు. పేరు మార్పును వెనక్కి తీసుకోవాలని విన్నవించారు.
కానీ వైసీపీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. పేరు మార్పు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. వైఎస్ఆర్ హయంలోనే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. తమ ప్రభుత్వంలో మరిన్ని కాలేజీలు ఏర్పాటు అవుతున్నాయని..అందుకు గుర్తుగా వైఎస్ఆర్ పేరు పెట్టామని స్పష్టం చేస్తున్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని..ఎన్టీఆర్‌ను అవమానించడం లేదంటున్నారు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టామని వైసీపీ నేతలు అంటున్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుపై అన్నగారి కుటుంబసభ్యులు ఘాటు స్పందించారు. ఇలాంటి పనులు మంచివి కావంటున్నారు. 25 ఏళ్లుగా ఉన్న పేరును మార్చడం ఏంటని అంటున్నారు. దీనిపై సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్పందించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ మహా నేతలన్నీ..ఇలా పేరు మార్చడం వల్ల ఎవరి కీర్తి పెరగదని..తగ్గదని ఎన్టీఆర్ అన్నారు. 25 ఏళ్లుగా ఉన్న పేరును మార్చడమంటే రాజకీయ కోణంలో ఆలోచించాల్సి ఉంటుందని కళ్యాణ్ రామ్ అభిప్రాయపడ్డారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
Also read:Congress: నోరు జారితే అంతే..పార్టీ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం స్వీట్ వార్నింగ్..!
Also read:PM Kisan Scheme: అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం..12వ విడత ఎప్పుడంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook