/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Dasara holidays 2022 Schedule in Telangana: తెలంగాణలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు 14 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు ఇస్తున్నట్టుగా ఇప్పటికే తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి ఉత్తర్వులు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా పాఠశాల విద్యా శాఖకు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్ రాధారెడ్డి ఓ లేఖ రాశారు. ఇప్పటికే ఈ వర్షా కాలం జూలై నెలలో 11వ తేదీ నుండి 16వ తేదీ వరకు భారీ వర్షాలు కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పాటు ఇటీవల సెప్టెంబర్ 17వ తేదీన జాతీయ సమైక్యత దినం సందర్భంగా ప్రకటించిన మరో సెలవుతో కలిపి ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 7 సెలవులు ప్రకటించారని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ ఈ లేఖ ద్వారా గుర్తుచేశారు. 

ఈ 7 సెలవుల కారణంగా విద్యా బోధనలో వెనుకంజలో ఉన్నామని.. ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ప్రస్తుతం ప్రకటించిన దసరా సెలవులను 14 రోజుల నుంచి 9 రోజులకు కుదించి అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు సెలవులు ఇవ్వాల్సిందిగా ప్రతిపాదిస్తున్నట్టు ఆమె పాఠశాల విద్యా శాఖకు తెలిపారు.

ఒకవేళ దసరా సెలవులను కుదించడం కుదరని పక్షంలో.. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఈ విద్యా సంవత్సరంలో రాబోయే అన్ని రెండో శనివారాల నాడు సెలవులను రద్దు చేసి పనిదినాలుగా ప్రకటించాల్సిందిగా కోరారు. అలా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చే రెండో శనివారాల్లో సెలవులు రద్దు చేయడం ద్వారా 5 పనిదినాలు కలిసొస్తాయనే ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం నిర్ధేశించిన 230 పనిదినాల లక్ష్యాన్ని అందుకోవాలంటే ఇదే తమ ముందున్న మార్గంగా ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ పాఠశాల విద్యా శాఖ దృష్టికి తీసుకొచ్చారు. 

ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ రాసిన లేఖపై పాఠశాల విద్యా శాఖ ఎలా స్పందిస్తుంది, ఏం నిర్ణయం తీసుకుంటుందనేదానిపై దసరా సెలవులు ఆధారపడి ఉన్నాయి. మొదటి ప్రతిపాదన ప్రకారం అయితే, దసరా సెలవులు 14 రోజులను కాస్తా 9 రోజులకు కుదించి అక్టోబర్ 1 నుంచి 9 వరకు ఇస్తారు. అలా కాకుండా రెండో ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకున్నట్టయితే... దసరా సెలవులను ముందుగా ప్రకటించిన షెడ్యూల్ (TS Dasara holidays schedule) ప్రకారం ఇలాగే కొనసాగిస్తూ.. ఇకపై నవంబర్ నుంచి మార్చి వరకు వచ్చే అన్ని రెండో శనివారాలను పని దినాలుగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకుంటారు.

Also Read : CPGET 2022 Results: సీపీగెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి!

Also Read : Big Billion Days 2022: ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌.. రూ. 549లకే Poco C31 మొబైల్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Dasara holidays in Telangana, scert writes to reduce dasara 2022 holidays schedule or cancel second saturdays
News Source: 
Home Title: 

Dasara Holidays in Telangana: తెలంగాణలో దసరా సెలవులు తగ్గించనున్నారా ? ఫుల్ డీటేల్స్ ఇదిగో

Dasara Holidays in Telangana: తెలంగాణలో దసరా సెలవులు తగ్గించనున్నారా ? ఫుల్ డీటేల్స్ ఇదిగో
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Dasara Holidays in Telangana: తెలంగాణలో దసరా సెలవులు తగ్గించనున్నారా ? ఫుల్ డీటేల్స్
Pavan
Publish Later: 
No
Publish At: 
Tuesday, September 20, 2022 - 23:02
Request Count: 
246
Is Breaking News: 
No