Rajnath Singh Met Prabhas and All The Family Members of Krishnam Raju: కొద్ది రోజుల క్రితం తెలుగు సినీ నటుడు, బిజెపి నేత కృష్ణంరాజు అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కృష్ణంరాజు కుటుంబాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పరామర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తో కలిసి హైదరాబాద్ లో కృష్ణంరాజు నివాసానికి వెళ్లి అక్కడ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కృష్ణంరాజు కుమార్తెలతో పాటు హీరో ప్రభాస్ ను పరామర్శించారు.
కృష్ణంరాజు మృతి పట్ల ప్రగాఢ సానుభూతి కూడా వ్యక్తం చేశారు. ఇక మరో పక్క కృష్ణంరాజు సంస్మరణ సభను క్షత్రియ సంఘం నిర్వహిస్తోంది. హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. ఆ సభలో కృష్ణంరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజనాధ్ సింగ్ మాట్లాడుతూ గోహత్య నిషేధం పై పార్లమెంట్ లో మొట్టమొదటి బిల్లు ప్రవేశపెట్టింది కృష్ణంరాజు అని ఆ తర్వాత కాలంలో యోగి ఆదిత్యనాథ్ కూడా గోహత్య విషయంపై బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు అని అన్నారు.
ఇక కృష్ణంరాజుని నేను అన్నగారు అని సంభోదించే వాడినన్న ఆయన కృష్ణంరాజు గారి దశదినకర్మ రోజు వద్దామనుకున్నా కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఈరోజు వచ్చాయని అన్నారు. బాహుబలి సినిమా చూడాలని కృష్ణంరాజు కోరితే మా ఫ్యామిలీ కృష్ణంరాజు ఫ్యామిలీ కలిసి బాహుబలి చూసామని బాహుబలి సినిమా చాలా నచ్చిందని అన్నారు. కృష్ణంరాజు ఒక మంచి వ్యక్తి అని మంచి స్నేహితుడని గుర్తు చేసుకున్నారు రాజనాధ్ సింగ్.
కృష్ణంరాజు తెలుగు ప్రజలకు రాజకీయ నాయకుడు, సినిమా స్టార్, రెబల్ స్టార్ కానీ కృష్ణంరాజు గ్రామంలో అందరికీ ఒక సొంత వ్యక్తి లాగా ఉండేవారని గ్రామంలో ప్రతి ఒక్కరిని కృష్ణంరాజు గుర్తుపడతారని ప్రతి ఒక్కరిని పేరుతో పిలుస్తారని అన్నారు. కృష్ణంరాజు ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్న ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నానని అన్నారు. ఈ సంస్కరణ సభకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వైసీపీ రెబల్ ఎంపీ కృష్ణంరాజు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు.
Also Read: AAGMC Vs NMBKV vs Saakini Daakini: సత్తా చాటిన కిరణ్ అబ్బవరం సినిమా.. మిగతా వాటి పరిస్థితి ఏమిటంటే?
Also Read: Saakini Daakini Review: 'రెజీనా-నివేధా'ల శాకిని డాకిని మూవీ రివ్యూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి