ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో నిర్మాణంలో వున్న బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 12 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తోంది. కూలిన బ్రిడ్జి కింద ఇంకెంతోమంది చిక్కుకున్నట్టు సమాచారం అందుతోంది. వారణాసి దుర్ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు.
SpotVisuals from #Varanasi: Portion of an under construction flyover collapses near Varanasi Cantt railway station, several feared trapped pic.twitter.com/126cWZhEbj
— ANI UP (@ANINewsUP) May 15, 2018
More than 12 people dead, several feared trapped after portion of an under construction flyover collapses in Varanasi's Cantt. area pic.twitter.com/h7LB1hC5fb
— ANI UP (@ANINewsUP) May 15, 2018
ఇదిలావుంటే, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు వారణాసిలో పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు ఉప ముఖ్యమంత్రి కేపీ మౌర్య, మరో మంత్రి నీలకంఠ్ తివారి వారణాసి బయల్దేరినట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏంటనే వివరాలపై మరింత సమాచారం అందాల్సి వుంది.
Dy CM KP Maurya & Minister Neelkanth Tiwari have been directed by CM to go to Varanasi's Cantt area, where over 12 people died after portion of under construction flyover collapsed there. CM expressed grief & directed admn to speed up rescue operation: Sidharth Nath Singh, UP Min pic.twitter.com/uw1X2subYk
— ANI UP (@ANINewsUP) May 15, 2018