Budh Vakri in Kanya 2022 Effect: ప్రస్తుతం బుధుడు కన్యారాశిలో ఉన్నాడు. సెప్టెంబరు 10న బుధుడు అదే రాశిలో తిరోగమనం (Budh Vakri in Kanya 2022) చేయనున్నాడు. అక్టోబరు 2 వరకు బుధుడు అదే స్థితిలో ఉంటాడు. అనంతరం బుధుడు తులరాశిలో సంచరిస్తాడు. తెలివితేటలు, వ్యాపారం, సంపదలకు కారకుడు..బుధుడు. కన్యారాశిలో మెర్క్యూరీ తిరోగమన ప్రభావం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
బుధుడు తిరోగమనం ఈరాశులకు శుభప్రదం
మిథునం (Gemini): మెర్క్యురీ తిరోగమన కదలిక మిథునరాశి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం ద్వారా అపారమైన ధనాన్ని ఆర్జించవచ్చు. న్యాయపరమైన విషయాలు పరిష్కారించబడతాయి.
కర్కాటక రాశి (Cancer): తిరోగమన బుధుడు కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనలాభాన్ని చేకూరుస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఈ సమయంలో విదేశీ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవచ్చు. మెుత్తం మీద ఈ టైం మీకు కలిసి వస్తుంది.
కన్య (Virgo): కన్యారాశిలోనే బుధుడు తిరోగమనంలో ఉంటాడు. దీని గరిష్ట ప్రభావం ఈ రాశిపైనే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. భారీ మెుత్తంలో డబ్బు చేతికి వస్తుంది. కొత్త కారు లేదా ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కెరీర్లో పురోగతికి బలమైన అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
వృశ్చిక రాశి (Scorpio): మెర్క్యురీ యొక్క తిరోగమన కదలిక వృశ్చిక రాశి వారికి కెరీర్ లో పురోగతిని ఇస్తుంది. వ్యాపారులకు భారీ లాభాలు వస్తాయి. అదృష్టంతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషరమైన వాతావరణం ఉంటుంది.
తిరోగమన బుధుడి పరిహారాలు
మెర్క్యురీ తిరోగమన చెడు ప్రభావం ఏ రాశివారిపై ఉంటుందో వారు ఆకుపచ్చ వస్తువులను దానం చేయండి. ఆవుకు మేత తినిపించండి. బుధవారం ఉపవాసం ఉండి గణపతిని పూజించండి. ఆ తర్వాత గణేశుడికి లడ్డూలు నైవేధ్యంగా పెట్టండి. దీంతో బుధుడు శుభఫలితాలను ఇస్తాడు.
Also Read: Surya Gochar 2022: సెప్టెంబర్ 17 నుండి ప్రకాశించనున్న ఈ రాశుల వారి అదృష్టం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook