Elephant Car Viral Video, Itchy Elephant rubbing a car in Forest: సాధారణంగా మనుషులకు దురద వేస్తే ఏం చేస్తారు.. చేతితోనో లేదా కర్రతోనే గోక్కుంటారు. సింహం, చిరుత, కుక్క, కోతి, పిల్లి లాంటి జంతువులు కూడా దురదేస్తే తమ కాళ్లతో గోక్కుంటాయి. అయితే భారీ జంతువు ఏనుగుకు దురదేస్తే ఏం చేస్తుంది.. దాని కాళ్లు పైకి లేవవు కాబట్టి ఏ చెట్టునో, బండరాయితో గోక్కుంటుంది. ఇవేమి అక్కడ లేకపోతే.. దానికి కనబడిన దానికి మూడుతుంది. రోడ్డుపై వెళుతున్న ఏనుగుకు దురదేస్తే.. వాహనాల పని అవుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రకారం... అడవి ప్రాంతంలో ఓ భారీ ఏనుగు రోడ్డు దాటుతుంటుంది. అదే సమయంలో దానికి దురద వేసిందో ఏమో.. రోడ్డుపై వెళుతున్న కారుకు అడ్డుగా నిలబడింది. కారు ఆగిన తర్వాత ఎడమ వైపు చక్రం ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత ముందు వైపుకు వెళ్లిన ఏనుగు.. తన బ్యాక్‌ను బానెట్‌కు వేసి గోక్కుంటుంది. అయినా కూడా అది సంతృప్తి చెందలేదు. ఆపై బానెట్‌పైకి ఎక్కి కూడా గోక్కుంటుంది. చివరకు డ్రైవర్ కారును రివర్స్ చేయడంతో అది అక్కడినుంచి వెళ్ళిపోతుంది.
What do you do when you’re itchy and you’re an elephant? 😂 pic.twitter.com/fYUMYdlO5z
— Buitengebieden (@buitengebieden) September 6, 2022
ఏనుగు గోక్కోవడం వాళ్ళ బూడిద రంగు సెడాన్ కారు దెబ్బతింటుంది. ఏనుగు బరువు కారణంగా బోనెట్ ప్రాంతం మొత్తం డామేజ్ అవుతుంది. అయితే ఏనుగు గోక్కోవడం తప్ప.. దాడి చేయకపోవడంతో కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. ఇందుకు సంబందించిన వీడియోను ట్విట్టర్ యూజర్ 'బ్యూటెంగెబిడెన్' ఇటీవల షేర్ చేశారు. ఈ వీడియోకి 2.3 మిలియన్ల వ్యూస్ మరియు 46000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. వీడియో చూస్తే మీరు నవ్వు ఆపుకోలేరు.
Also Read: NEET 2022 Results: నీట్ 2022 ఫలితాలు విడుదల.. తెలంగాణ విద్యార్థికి ఐదో ర్యాంకు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి