Ugly Fan wars of south heros Becoming hot topic: సోషల్ మీడియాలో హీరోల అభిమానుల తీరు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. ఒకప్పుడు హీరోల అభిమానులు తమ హీరోల పేరిట మంచి పనులు చేస్తూ ఆయనకు మంచి పేరు తీసుకురావాలని అన్నదానాలు, రక్తదానాలు వంటివి నిర్వహిస్తూ ఉండేవారు. అయితే ఎప్పుడైతే సోషల్ మీడియా బాగా విరివిగా అందుబాటులోకి వచ్చిందో అప్పటినుంచి ఈ అన్నదానాలు రక్త దానాలు తక్కువయి తమ తమ హీరోలు పుట్టినరోజులు ఇతర ముఖ్యమైన రోజుల్లో ఎక్కువ ట్వీట్లు చేసి గతంలో ఇతర హీరోల అభిమానులు క్రియేట్ చేసిన రికార్డులను బద్దలు కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇతర హీరోలతో కానీ వారి అభిమానులతో కానీ ఏమైనా చిన్న గొడవ మొదలైతే మాత్రం దాన్ని ఒక రాద్ధాంతం లాగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్చల్ సృష్టిస్తున్నారు అభిమానులు.
మేము మేము బాగానే ఉంటాం మీరు ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని హీరోలు ఎన్ని సందర్భాల్లో తమ అభిమానులకు బహిరంగంగానే సూచనలు చేస్తున్నా వాటిని పట్టించుకున్న పాపాన పోకుండా తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఇతర హీరోలను వారి కుటుంబ సభ్యులను సైతం ట్రోల్ చేస్తున్న సంస్కృతి బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు తమిళ హీరోలు విజయ్ అలాగే అజిత్ అభిమానులు ఈ విధమైన సోషల్ మీడియా ఫ్యాన్స్ వార్ కు దిగుతూ ఉండేవారు. దారుణమైన రీతిలో అజిత్ అభిమానులను విజయ్ అభిమానులు విజయ్ అభిమానులను అజిత్ అభిమానులు ట్రోల్ చేస్తూ ఉండేవారు. అయితే ఈ మధ్యకాలంలో కొంతవరకు మీ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఇలాంటి ఫ్యాన్ వార్స్ చోటు చేసుకోవడం లేదు అనుకుంటే ఈ ట్రెండ్ తెలుగు అభిమానుల వరకు సోకింది. ముందుగా ప్రభాస్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకసారి ఇదే విధమైన దారుణ రీతిలో ట్రోల్ చేసుకున్నారు. తర్వాత ఆ స్థాయిలో మంది ట్రోలింగ్స్ లేవు అనుకుంటున్న సమయంలో అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానులు దారుణమైన రీతిలో ఒకరిమీద ఒకరు విరుచుకుపడ్డారు.
అసలు రాయలేని విధంగా ఒకరి కుటుంబాన్ని మరొకరు బయటికి లాగుతూ రెచ్చిపోయారు. సాధారణంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీలో వ్యక్తి అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ మెగా ఫ్యామిలీలోని మరో హీరో రాంచరణ్ అభిమానులు ఈ స్థాయిలో విరుచుకు పడటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ముందు ఎవరు మొదలుపెట్టారు అనే విషయం మీద క్లారిటీ లేదు కానీ ఒక పక్క అల్లు అర్జున్ అభిమానులు మరోపక్క రామ్ చరణ్ అభిమానులు దారుణమైన రీతిలో తమ హీరోలు వాటిని చూస్తే అసహ్యించుకునే రీతిలో ట్రోల్ చేసుకున్నారు. ఇక తాజాగా మహేష్ అభిమానులు తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానులు కూడా అదే రీతిలో రెచ్చిపోయారు. నిజానికి కొద్ది రోజుల నుంచి తెలుగు సోషల్ మీడియా పేజెస్ ఎక్కువగా విజయ్ ని ట్రోల్ మెటీరియల్ లాగా వాడుతున్నాయి. బహుశా దాని మీద కోపం పెంచుకున్నారో ఏమో తెలియదు కానీ తమిళ సినీ అభిమానులు అందరూ విజయ్ ఫ్యాన్స్ తో కలిసి మహేష్ బాబును టార్గెట్ చేశారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు అసలు ఏ మాత్రం ఈ వ్యవహారంలో సంబంధం లేని మహేష్ బాబుని లాగుతూ మహేష్ బాబు మీద దారుణమైన రీతిలో ట్రోలింగ్స్ మొదలుపెట్టారు విజయ్ అభిమానులు .
మేమేం తక్కువ తిన్నామా అని మహేష్ అభిమానులు కూడా అందుకుని వారికి గట్టిగానే సమాధానం చెప్పారు. ఆ సమాధానం చెప్పిన రీతి విజయ్ అభిమానులు ట్రోల్ చేసిన రీతికి తగినట్లుగా ఉంది. దీంతో ఆ పదాలు కూడా మనం రాయలేని విధంగా దారుణమైన విధంగా ఒక హీరోని మరో హీరో అభిమానులు టోల్ చేసుకున్నారు. వారు ఏ రేంజ్ లో ట్రోల్ చేసుకున్నారు అంటే ఆఖరికి ట్విట్టర్ ఆ పదాలను గుర్తించి అసభ్యకరంగా ఉన్నాయని చెబుతూ ట్రెండ్స్ ను డిలీట్ చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే చివరికి ట్విట్టర్ ఆ పదాలను తొలగించడంతో మై డియర్ మహేష్ బాబు మై డియర్ విజయ్ అనే ట్రెండ్ మొదలుపెట్టారు ఇద్దరు హీరోల అభిమానులు. అలా మొదలుపెట్టి కూడా కొట్టుకోవడం ఆపడం లేదు కానీ తీవ్రత తగ్గించారు. అయితే కొద్ది రోజులలో విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అలాగే మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా కూడా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో రూపొంది అవకాశాలు ఉన్నాయని అంచనాలు వెలువడుతున్న సమయంలో ఇలా అభిమానులు కొట్టుకోవడం చర్చినీయాంశంగా మారింది.
విజయ్ కు ఇటు తెలుగు రాష్ట్రాల్లో మహేష్ బాబుకు అటు తమిళంలో కూడా ఈ పరిణామాలు ఇబ్బంది పెట్టేవే అని చెప్పక తప్పదు. ఈ క్రమంలో రి వారి అభిమానులు కొంతమేర వెనక్కి తగ్గి ఉండొచ్చు అని భావించవచ్చు. అలాగే యష్ అభిమానులు, సుదీప్ అభిమానులు కూడా ఇలాగే దారుణంగా ట్రోల్ చేసుకున్నారు. ఇప్పుడు బాలీవుడ్ హీరోలు చేస్తున్న ఏ సినిమా పెద్దగా కలిసి రావడం లేదు. బాలీవుడ్ హీరోలు సైతం తెలుగు హీరోలు తమ సినిమాలను ప్రమోట్ చేస్తే కనీసం తెలుగు రాష్ట్రాలలో అయినా మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చు అని భావిస్తూ వారి చేత ప్రమోషన్స్ చేయించుకుంటున్నారు. ఇలాంటి దరుణంలో ఇలా మన హీరోల అభిమానులు రోజులు మీడియా వేదికగా రచ్చ కెక్కి కొట్టుకుంటూ ఉంటే బాలీవుడ్ హీరోలకి మాత్రమే కాదు బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దక్షిణాది హీరోల మీద దక్షిణాది హీరో అభిమానుల మీద చులకన భావన ఏర్పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా దక్షిణాది హీరోలు యష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటివారు నిలబడుతున్న సమయంలో ఈ విధంగా ఒక హీరోని మరొక హీరో అభిమానులు, ట్రోల్ చేసుకోవడం అనేది ఏమాత్రం ఆమోదయోగ్యం కాని విషయం. ఇకమీదట అయినా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని అనవసరమైన ట్రోలింగ్స్ జోలికి వెళ్లకుండా ఉంటే అందరికీ బావుంటుందని విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.
Also Read: iBOMMA Close: సినీ ప్రియులకు బిగ్ షాక్.. ఆ రోజు నుంచి శాశ్వతంగా ఐబొమ్మ సేవలు బంద్!
Also Read: Mahesh fans vs Vijay fans: రెచ్చిపోయిన స్టార్ హీరోల అభిమానులు.. రాయలేని విధంగా ట్రోలింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి