Flipkart Big Billion Days 2022: త్వరలో ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్ బిలియన్ డేస్'.. ఏయే వస్తువులపై ఎంత తగ్గింపు ఉండనుందంటే..

Flipkart Big Billion Days 2022: కస్టమర్స్ కోసం త్వరలో బిగ్ బిలియన్ డేస్ సేల్‌ నిర్వహించనుంది ఫ్లిప్‌కార్ట్. ఈ సేల్ తేదీలపై త్వరలోనే ప్రకటన రావొచ్చు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Sep 3, 2022, 04:03 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో త్వరలో బిగ్ బిలియన్ డేస్
  • అన్ని రకాల వస్తువులపై బిగ్ డిస్కౌంట్స్, బిగ్ డీల్స్
  • ఏయే వస్తువులపై ఎంత తగ్గింపు అంటే...
Flipkart Big Billion Days 2022: త్వరలో ఫ్లిప్‌కార్ట్‌ 'బిగ్ బిలియన్ డేస్'.. ఏయే వస్తువులపై ఎంత తగ్గింపు ఉండనుందంటే..

Flipkart Big Billion Days 2022: ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో త్వరలో 'ది బిగ్ బిలియన్ డేస్' సేల్ నడవనుంది. ఫ్లిప్‌కార్ట్‌ సైట్‌లో దీనికి సంబంధించిన ప్రకటన కనిపిస్తోంది. సేల్ ఎప్పటినుంచి ఎప్పటివరకు ఉంటుందనేది ఇంకా వెల్లడించలేదు. మరికొద్ది రోజుల్లోనే ఈ సేల్‌ తేదీలు ప్రకటించవచ్చు. అయితే ఈ సేల్‌లో అందుబాటులో ఉండే ఆఫర్స్, డీల్స్, డిస్కౌంట్స్‌ మాత్రం ముందుగానే ప్రకటించారు. రూ.99 విలువ చేసే చిన్న చిన్న వస్తువులు మొదలు రూ.1 లక్ష విలువ చేసే లగ్జరీ వస్తువుల వరకు ఈ సేల్‌ ద్వారా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఏయే వస్తువులపై ఎంత మేర డిస్కౌంట్స్, ఇతరత్రా ఆఫర్స్ అందిస్తున్నారో ఇప్పుడు చూద్దాం...

ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం డిస్కౌంట్ ఆఫర్ :

ఫ్లిప్‌కార్ట్‌ 'ది బిగ్ బిలియన్ డేస్' సేల్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. స్మార్ట్ ఫోన్లు, గేమింగ్ ల్యాప్‌టాప్స్, ప్రింటర్స్, మానిటర్స్, మొబైల్ యాసెసరీస్, ట్రిమ్మర్స్, హెడ్ ఫోన్స్ తదితర వస్తువులపై ఈ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్యాన్లు, గీజర్లు,ఇతరత్రా గృహోపకరణాలపై కూడా 80 శాతం డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉండనుంది.

దుస్తులపై 60-90 శాతం డిస్కౌంట్ : 

వివిధ ఫ్యాషన్ బ్రాండ్స్‌పై 'ది బిగ్ బిలియన్ డేస్' సేల్‌లో 60-90 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది. టీషర్ట్స్, జీన్స్, జాకెట్స్, టాప్స్, ఇతరత్రా దుస్తులపై ఈ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే అలెన్ సోలీ, ఫాస్ట్ ట్రాక్ వంటి టాప్ బ్రాండ్స్‌కి చెందిన వాచీలపై 80 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది.

బ్యూటీ, టాయ్స్, స్పోర్ట్స్ వస్తువులపై 80 శాతం వరకు :

మహిళలు ఉపయోగించే మేకప్ సామాగ్రి, కాస్మోటిక్స్, పర్ఫ్యూమ్స్, మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్, పిల్లల టాయ్స్, స్టేషనరీ, ఫుడ్ అండ్ బేవరేజెస్‌పై 60 శాతం నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది.

హోమ్ అండ్ కిచెన్ :

ప్రెజర్ కుక్కర్స్, హోమ్ ఫర్నీషింగ్స్, హోమ్ టూల్స్, హోమ్ డెకార్ తదితర వస్తువులపై 50 నుంచి 80 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది. అలాగే, ఫర్నీచర్, పరుపులపై 85 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.

బిగ్ బిలియన్ డేస్ డీల్స్ :

డిస్కౌంట్ ఆఫర్స్ మాత్రమే కాదు పలు డీల్స్ కూడా ఈ సేల్‌లో అందుబాటులో ఉండనున్నాయి. క్రేజీ డీల్స్, రష్ అవర్ డీల్స్, టిక్‌టాక్ డీల్స్ పేరిట కొన్ని రకాల వస్తువులను అతి చౌక ధరకే పొందే ఆఫర్స్ అందించనున్నారు. బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసం ఫ్లిప్‌కార్ట్ ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ టైఅప్ అయింది. తద్వారా ఈ బ్యాంకు కార్డులపై బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో 10 శాతం తక్షణ తగ్గింపు పొందే ఆఫర్ అందుబాటులో ఉండనుంది.

Also Read: KCR VS NTR: మెగా ఫ్యామిలీకి రెడ్ కార్పెట్.. ఎన్టీఆర్ కు బ్రేక్! కేసీఆర్ సర్కార్ ఎందుకిలా..?

Also Read: Revanth Reddy: అమ్ముడుపోయిన సర్పంచ్ లను చితక్కొట్టండి.. మునుగోడులో రేవంత్ రెడ్డి పిలుపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x