Asia Cup 2022: రేపే భారత్, పాకిస్థాన్ హైవోల్టేజ్‌ మ్యాచ్..తుది జట్లు ఇదిగో..!

Asia Cup 2022: ఆసియా కప్..సూపర్-4 దశకు చేరింది. మరోమారు దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి.

Written by - Alla Swamy | Last Updated : Sep 3, 2022, 03:39 PM IST
  • ఆసియా కప్ 2022
  • సూపర్-4కు చేరిన టోర్నీ
  • రేపే భారత్ వర్సెస్ పాక్
Asia Cup 2022: రేపే భారత్, పాకిస్థాన్ హైవోల్టేజ్‌ మ్యాచ్..తుది జట్లు ఇదిగో..!

Asia Cup 2022: ఆసియా కప్ రసవత్తరంగా సాగుతోంది. నేటి నుంచి సూపర్-4 మ్యాచ్‌లు జరగున్నాయి. ఇవాళ శ్రీలంక, అఫ్ఘనిస్థాన్ మధ్య తొలి మ్యాచ్‌ జరుగుతుంది. ఆసియా కప్‌లో రేపు(ఆదివారం) మరోమారు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీంతో ఇరుదేశాల అభిమానులకు మరోసారి కిక్‌ ఇచ్చే మ్యాచ్‌ జరగనుంది. దుబాయ్ వేదికగా రేపు రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. ఈమ్యాచ్‌లోనూ టీమిండియానే గెలుస్తుందని అంతా భావిస్తున్నారు.

ఆసియా కప్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో గెలిచి భారత్ జోరు మీద ఉంది. మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్, రెండో మ్యాచ్ హాంకాంగ్‌ జట్లపై టీమిండియా ఘన విజయం సాధించింది. అదే జోష్‌ను సూపర్-4లో చూపించాలని భారత జట్టు భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా టీమిండియా బలంగా ఉంది. హాంకాంగ్‌ మ్యాచ్‌లో బౌలర్లు విఫలమైనా..భారత్‌కే విజయం వరించింది. గత రెండు మ్యాచ్‌ల్లో ఆడిన టీమ్‌నే పాకిస్థాన్‌ మ్యాచ్‌లో ఆడించే అవకాశం ఉంది.

గాయం కారణంగా ఇప్పటికే జట్టుకు ఆల్‌రౌండర్ జడేజా దూరమయ్యాడు. అతడి స్థానంలో అక్షర్‌ పటేల్‌ను ఎంపిక చేశారు. దీంతో అక్షర్ పటేల్ చేరికపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇటు అశ్విన్‌ను సైతం ఆడిస్తారన్న ప్రచారం జరుగుతోంది. బ్యాటింగ్ విభాగంలో ఎలాంటి మార్పులు ఉండే పరిస్థితి లేదు. హాంకాంగ్‌ మ్యాచ్‌లో ఆడిన పంత్‌ను పక్కకు పెట్టి..హార్దిక్ పాండ్యాను తీసుకునే అవకాశం ఉంది. దినేష్‌ కార్తీక్ కీపింగ్ చేయనున్నాడని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు.

హాంకాంగ్‌ మ్యాచ్‌లో బౌలర్లు అవేష్‌ ఖాన్, అర్ష్‌దీప్ పటేల్ ఘోరంగా విఫలమయ్యారు. పరుగులు దారుణంగా ఇచ్చారు. ఐనా వారిని మళ్లీ ఆడించే అవకాశం ఉంది. ఎందుకంటే రిజర్వ్ బెంచ్‌లో పేసర్లు లేకపోవడంతో వారికి మరోమారు అవకాశం దక్కనుంది. పాకిస్థాన్‌ జట్టు బలంగా ఉంది. ఈమ్యాచ్‌లో గెలిచి ప్రతికారం తీసుకోవాలని బాబర్ అజామ్ జట్టు భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఓడినా..రెండో మ్యాచ్‌లో భారీ విజయంతో సూపర్-4లోకి పాకిస్థాన్ జట్టు ప్రవేశించింది. 

గత టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సాధించిన విజయాన్ని గుర్తు చేసుకుని ముందుకు వెళ్లాలని ఆ జట్టు యోచిస్తోంది. అన్నివిభాగాల్లో రాణిస్తే భారత్‌ను ఓడించడం కష్టమేమి కాదని ఇప్పటికే పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు వెల్లడించారు. భారీ స్కోర్ చేసి..బౌలింగ్‌తో టీమిండియాను అడ్డుకట్ట వేయాలని పాకిస్థాన్ స్కెచ్‌లు వేస్తోంది. సూపర్-4లో ప్రతి మ్యాచ్‌ కీలకం కానుంది. ఇందులో టాప్‌లో ఉన్న రెండు జట్లు ఫైనల్‌కు చేరనున్నాయి. తర్వాతి మ్యాచ్‌ల్లో భారత జట్టు..సెప్టెంబర్ 6న శ్రీలంక, ఈనెల 8న అఫ్ఘనిస్థాన్ జట్టుతో తలపడనుంది.

Also read:KCR VS NTR: మెగా ఫ్యామిలీకి రెడ్ కార్పెట్.. ఎన్టీఆర్ కు బ్రేక్! కేసీఆర్ సర్కార్ ఎందుకిలా..?

Also read:AUS vs ZIM 2022: వన్డేల్లో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌ సరికొత్త రికార్డు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News