KCR VS NTR: రామోజీ ఫిల్మ్ సిటీలో శుక్రవారం సాయంత్రం జరగాల్సిన బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దైంది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో చివరి నిమిషంలో షోను రద్దు చేసుకున్న చిత్ర యూనిట్.. రాత్రి పార్క్ హయత్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది. బ్రహ్మస్త్ర మూవీ ఈవెంట్ కు తెలంగాణ పోలీసులు అనుమతిని నిరాకరించడంపై రాజకీయ రచ్చ సాగుతోంది. కేంద్రమంత్రి అమిత్ షాను ఇటీవల కలిసిన జూనియర్ ఎన్టీఆర్ ... ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వస్తున్నందునే తెలంగాణ సర్కార్ అనుమతి ఇవ్వలేదనే చర్చ సాగుతోంది. వినాయక చవితి బందోబస్తు కారణంగా భద్రత ఇవ్వలేమని పోలీసులు చెబుతున్నదంతా ఉత్తదేనని.. హైదరాబాద్ లో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయని, సినిమాలకు సంబంధించిన ఈవెంట్లు కూడా సాఫీగా సాగిపోతున్నాయని తారక్ ఫ్యాన్స్ చెబుతున్నారు. కేసీఆర్ సర్కార్ మొదటి నుంచి మెగా ఫ్యామిలీ పట్ల ఒక రకంగా... ఇతరులతో మరో రకంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకు పలు ఘటనలను ఉదహరిస్తున్నారు జూనియర్ అభిమానులు.
ఆగస్టు 31న హైదరాబాద్ లో జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కథ అందించిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆగస్టు 31నే వినాయక చవితి. బ్రహ్మాస్త మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వినాయక చవితి కారణంగా అనుమతి ఇవ్వలేమని చెప్పిన పోలీసులు... చిరంజీవి హాజరైన సినిమా ఈవెంట్ కు ఎలా పర్మిషన్ ఇచ్చారనే ప్రశ్నలు వస్తున్నాయి. వినాయక చవితి రోజున చిరంజీవి హాజరైన ఈవెంట్ జరిగింది. అది కూడా హైదరాబాద్ నగరంలోనే. కాని జూనియర్ ఎన్టీఆర్ హాజరుకావాల్సిన బ్రహ్మాస్త్ర మూవీ వేడుక మాత్రం సిటీకి దూరంగా ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలో. అక్కడికి బయటి వ్యక్తులు వెళ్లడానికి అవకాశం కూడా ఉండదు. అయినా జూనియర్ ఎన్టీఆర్ ఈవెంట్ కు పోలీసులు అనుమతిని రద్దు చేయడం రాజకీయ కారణంతో కాకుంటే మరేంటనే చర్చ వస్తోంది.
ఈ ఒక్క ఘటనే కాదు గతంలోనూ మెగా ఫ్యామిలీ విషయంలో కేసీఆర్ నిర్ణయాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఏప్రిల్ 23, 2022 మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీసులే దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ నగరంలో మధ్యలో ఉంటుంది. అక్కడ ఈవెంట్ జరిగితే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు ఉంటాయి. అయినా ట్రాఫిర్ డైవర్షన్ చేసి మరీ ఆచార్య సినిమా ఈవెంట్ కు తెలంగాణ సర్కార్ అండగా నిలిచింది. చిరంజీవి సినిమా కాబట్టే కేసీఆర్ సర్కార్ అలా చేసిందనే ఆరోపణలు జూనియర్ ఫ్యాన్స్ నుంచి వస్తున్నాయి.
ఇక ఫిబ్రవరి 23, 2022న యూసుప్ గూడా పోలీస్ గ్రౌండ్ లోనే జనసేన చీఫ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా అందరిని షాకింగ్ కు గురి చేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. పవన్ కల్యాణ్ సినిమా ఈవెంట్ కు కేటీఆర్ హాజరుకావడం సినీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఉద్యమ సమయంలో , తర్వాత కాలంలోనూ కేసీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు పవన్ కల్యాణ్. కేసీఆర్ ఫ్యామిలీపైనా తీవ్రమైన కామెంట్లు చేశారు. అయినా పవన్ సినిమా వేడుకకు కేటీఆర్ హాజరయ్యారు. బీమ్లానాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు తెలంగాణ సర్కార్ పూర్తిగా సహకరించింది. ట్రాఫిక్ మళ్లింపులు మొదలుకుని పార్కింగ్ కల్పనలో పోలీసులు శ్రమించారు.
ఇలా మెగా బ్రదర్స్ విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ సర్కార్.. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కావాలనే అడ్డంకులు స్పష్టించిందనే టాక్ వస్తోంది. దీనికంతటికి కారణం అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలవడమే అంటున్నారు. కొంత కాలంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం సాగుతోంది. ప్రధాని మోడీని కేసీఆర్ ఓ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా ఇరు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జూనీయర్ ఎన్టీఆర్.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవడాన్ని కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారనే అంటున్నారు.
Also Read : Brahmastra Pre-Release Event: బ్రహ్మస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ వెనుక కేసీఆర్ సర్కారు ?
Also Read: కార్తికేయ 2 సక్సెస్ ను జీర్ణించుకోలేక పోతున్న ఛార్మీ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
KCR VS NTR: మెగా ఫ్యామిలీకి రెడ్ కార్పెట్.. ఎన్టీఆర్ కు బ్రేక్! కేసీఆర్ సర్కార్ ఎందుకిలా..?