Weather Updates: ఏపీ, తెలంగాణలో రాగల మూడురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కిందిస్థాయిలోని గాలులు ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా రాగల మూడురోజులపాటు వానలు పడే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ, రేపు తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఎల్లుండి మరికొన్ని చోట్ల ఇదే వాతావరణం ఉండనుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో రాగల మూడురోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ కింది స్థాయిలోని గాలులు బలంగా వీస్తున్నాయి. దీంతో కోస్తాంధ్ర, రాయలసీమలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజులపాటు ఎండలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎండలు మండుతున్నా..వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. హైదరాబాద్‌లోనూ విచిత్ర వాతావరణం కనిపిస్తోంది. ఉదయం నుంచి ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రం వేళల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి.
ఎండల తీవ్రత అధికంగా ఉన్నా..వేసవితో పోలిస్తే తక్కువేనని హైదరాబాద్ వాతావరణ తెలిపింది. ఐనా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. తెలంగాణవ్యాప్తంగా 30 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో వర్షాలు కురిసే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిణి నాగమణి తెలిపారు. విచిత్ర వాతావరణం పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
Daily Weather Video (Hindi) Dated 02-09-2022
Facebook link: https://t.co/TJalSGOGSl
You Tube link: https://t.co/uApxnH3aLb
— India Meteorological Department (@Indiametdept) September 2, 2022
o Subdued rainfall activity over plains of northwest India and over Central India during next 5 days. pic.twitter.com/wuqbMS8HEn
— India Meteorological Department (@Indiametdept) September 2, 2022
Also read:Chandrababu Wishes to Pawan Kalyan: బాబుకు ఎన్టీఆర్ కంటే పవనే ఎక్కువయ్యారా?
Also read:మైండ్ బ్లాకింగ్ కాంబో.. ఒకే ఫ్రేమ్‌లో రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ, రష్మిక, త్రిష, దీపికా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Weather Updates: తెలుగు రాష్ట్రాలకు మరోమారు వర్ష సూచన..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
గాలుల ప్రభావంతో వానలు
అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ