Heart Attacks: గుండె వ్యాధిగ్రస్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరో దశాబ్ది కాలంలో ఇండియా..హార్ట్ ఎటాక్ వ్యాధికి కేంద్రం కావచ్చనే ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో గుండె వ్యాధుల్ని సంరక్షించే మార్గాల్ని తెలుసుకుందాం..
చెడు జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఇటీవలి కాలంలో గుండె సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి. తక్కువ వయస్సుకే గుండెపోటుకు గురవుతున్నారు. ఓ అధ్యయనం ప్రకారం మరో దశాబ్దకాలానికి ఇండియా హార్ట్ ఎటాక్ వ్యాధికి కేంద్రం కావచ్చనే అంచనా కూడా ఉంది. ఎందుకీ పరిస్థితి అంటే ఒకటే సమాధానం వస్తోంది. వ్యాయామం లోపించడం, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడికి లోనవడం, జీవనశైలి సరిగ్గా లేకపోవడం, నిద్రలేమి ముఖ్యంగా కన్పిస్తున్నాయి.
యోగా, వ్యాయామం చేస్తే ఏ రోగమూ దరిచేరదని చాలామంది అంటుంటారు. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా అవసరం. ప్రతిరోజూ నియమిత రూపంలో యోగా లేదా వ్యాయామం చేస్తే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకుంటే ఏ విధమైన రోగాలు రావు. యోగా లేదా వ్యాయామంతో చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నిగారింపు వస్తుంది. తీవ్రరోగాల్ని ఎదుర్కొనే సామర్ధ్యం వస్తుంది.
వ్యాయామం లేదా యోగా వల్ల గుండె సంబంధిత రోగాల ముప్పు కచ్చితంగా తగ్గుతుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్ ప్రకారం రానున్న దశాబ్దానికి ఇండియా గుండె వ్యాధులకు కేంద్రంగా మారవచ్చు. ఇండియా ప్రస్తుతం మధుమేహం, అధిక రక్తపోటు విషయంలో ఓ మహమ్మారి వంటి పరిస్థితిని ఎదుర్కొంటోంది. గుండెపోటుల్లో ప్రపంచ రాజధాని కావచ్చనే ఆందోళన ఎక్కువౌతోంది. గుండెపోటు, స్ట్రోక్స్, అధిక రక్తపోటు, మధుమేహం, ధమనుల్లో ఇబ్బంది వంటి వ్యాధులు ఎక్కువౌతున్నాయి. ఈ వ్యాధుల్ని యోగా లేదా వ్యాయామం ద్వారా తగ్గించవచ్చు.
Also read: Aloevera Health Benefits: అల్లోవెరా వెనిగర్ ఏయే చికిత్సల్లో ఉపయోగిస్తారు, కలిగే లాభాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Heart Attacks: ఇండియా మరో పదేళ్లలో గుండెపోటు వ్యాధులకు కేంద్రం కానుందా..ఏం జరగనుంది