Astro Tips: మీ దురదృష్టం కూడా అదృష్టంగా మారాలంటే...రోజూ ఈ 5 పనులు చేయండి!

Astro Tips : దురదృష్టవంతులను కూడా అదృష్టవంతులను చేసే చిట్కాలు ఆస్ట్రాలజీలో చెప్పబడ్డాయి. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 31, 2022, 11:19 AM IST
Astro Tips: మీ దురదృష్టం కూడా అదృష్టంగా మారాలంటే...రోజూ ఈ 5 పనులు చేయండి!

Astro Tips For Good Luck; ప్రతి ఒక్కరూ లగ్జరీగా, సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. అయితే అది కొంత మందికే సాధ్యమవుతుంది. మరికొందరిని దురదృష్టం వెంటాడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ దురదృష్టవంతులను కూడా అదృష్టవంతులను చేసే చిట్కాలు ఉన్నాయి. ఇవి పాటించడం వల్ల మీ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోయి మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. 

అదృష్టం రావాలంటే..
>> జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడాలంటే..ఆదివారం నాడు తాంబూలం చెట్టును పూజించండి. ఆ తర్వాత డబ్బును ఆ స్థలంలో ఉంచండి. దీంతో మీ అదృష్టం ప్రకాశిస్తుంది. 
>> మనిషి సరైన దిశలో కూర్చుని ఆహారం తీసుకుంటే జీవితంలో ఆనందం ఉంటుంది. జ్యోతిష్యం మరియు వాస్తు శాస్త్రం ప్రకారం, ఎల్లప్పుడూ తూర్పు ముఖంగా కూర్చుని పుడ్ ను తినాలి. 
>> పూజలో ఉపయోగించే పువ్వులు లేదా ఇతర పదార్థాలను తిరస్కరించరాదు. ఈ ఎండిన పువ్వులను పారే నీటిలో వేయండి. అలా కాకపోతే పాతిపెట్టండి. దీంతో మీకు లాభం చేకూరుతుంది. 
>> ప్రతిరోజూ సాయంత్రం తులసి చెట్టు కింద దీపం వెలిగించండి. ఇది ఇంట్లో సానుకూలతను తెస్తుంది. దీంతో పాటు మాత లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు త్వరలోనే ధనవంతులు అవుతారు.  
>> రోజూ స్నానం చేసిన తర్వాత ఇంటి ఈశాన్య మూలలో గంగాజలంను చల్లండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

Also Read: Ganesh Chaturthi 2022: బొజ్జ గణపయ్యకు అత్యంత ఇష్టమైన 5 పదార్థాలివే.. ఇవి నైవేద్యంగా పెడితే గణనాథుడి అనుగ్రహం తప్పక పొందుతారు..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News