RPF personnel saves Woman life while she walking towards a moving train in Mumbai: సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనుషులు, జంతువులకు సంబందించిన వీడియోలు వైరల్ అవుతాయి. ఇందులో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్థాయి. ఇంకొన్ని వీడియోలు మాత్రం భయభ్రాంతులకు గురిచేస్తాయి. తాజాగా ఓ యువతి ఆత్మహత్యాయత్నంకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దక్షిణ ముంబైలోని బైకుల్లా రైల్వే స్టేషన్‌లో ఓ యువతి ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించింది. ట్విట్టర్ యూజర్ మంథన్ కె మెహతా షేర్ చేసిన వీడియో ప్రకారం.. ముంబైలోని బైకుల్లా రైల్వే స్టేషన్‌లో ఓ యువతి పట్టాలపై నడుచుకుంటూ.. ఎదురుగా వస్తున్న లోకల్ ట్రైన్ వైపు వెళ్ళింది. రైల్వే ట్రాక్‌పై యువతిని గుర్తించిన కొందరు స్టేషన్‌లో అరుస్తూ ఉన్నారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సిబ్బంది అరుస్తున్నా.. ఆ యువతి వినలేదు. ట్రైన్ హారన్ కొడుతున్నా పట్టించుకోకుండా.. రైలుకు ఎదుగురుగా దూసుకెళ్లింది.
A woman’s suicide attempt in front of a local train was foiled due to presence of mind of a @Central_Railway motorman and RPF personnel at Byculla station on Saturday pic.twitter.com/FafFdtFSKk
— Manthan K Mehta (@manthankmehta) August 28, 2022
సరిగ్గా రైలు యువతిని ఢీకొట్టే సమయానికి రైల్వే పోలీస్ వెనుక నుంచి వచ్చి ఆమెను పక్కకు నెట్టివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సరైన సమయంలో ఆర్పీఎఫ్ సిబ్బంది రావడంతో యువతి ఆత్మహత్యాయత్నం విఫలమైంది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. ఈ వీడియోను మంథన్ కె మెహతా నెట్టింట పోస్ట్ చేయగా అది వైరల్ అయింది. ఆర్పీఎఫ్ సిబ్బందిని అందరూ ప్రశంసిస్తున్నారు.
Also Read: జాతీయ క్రీడా దినోత్సవం.. మనలో ఆత్మవిశ్వాసం నింపి జోష్‌నిచ్చే బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే!
Also Read: వందల కోట్ల ఆస్తి.. రెండు పెళ్లిళ్లు.. నాగార్జున గురించి మీకు తెలియని విషయాలివే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి