Morning Good Habits: ఆ నాలుగు అలవాట్లుంటే చాలు..చర్మం, కేశాలకు నిగారింపు ఖాయం

Morning Good Habits: ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్ఠికాహారంతో పాటు అలవాట్లు కూడా బాగుండాలి. లేకుంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ప్రతిరోజూ ఉదయం వేళ..ఈ పనులు చేస్తే ఆరోగ్యంతో పాటు కేశ, చర్మ సంబంధిత సమస్యలు దూరమౌతాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 27, 2022, 06:51 PM IST
Morning Good Habits: ఆ నాలుగు అలవాట్లుంటే చాలు..చర్మం, కేశాలకు నిగారింపు ఖాయం

Morning Good Habits: ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్ఠికాహారంతో పాటు అలవాట్లు కూడా బాగుండాలి. లేకుంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ప్రతిరోజూ ఉదయం వేళ..ఈ పనులు చేస్తే ఆరోగ్యంతో పాటు కేశ, చర్మ సంబంధిత సమస్యలు దూరమౌతాయి.

కొంతమంది శ్వాసలో ఓ రకమైన దుర్గంధం ఉంటుంది. ఫలితంగా జీవనశైలిపై ప్రభావం పడుతుంది. సాధారణంగా ఈ పరిస్థితి చెడు ఆహార పదార్ధాల కారణంగా వస్తుంది. అందుకే ఆహార పదార్ధాలు మార్చుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నోటి దుర్గంధం నియంత్రించాలంటే ఆహార పదార్ధాలు మార్చుకోవాలి. దీనివల్ల మీ జీర్ణక్రియ, కేశాలు, చర్మం మెరుగ్గా ఉంటుంది. ఏ అలవాట్లు మార్చుకోవాలనేది పరిశీలిద్దాం.

మీ ఆరోగ్యం మెరుగుపర్చుకునేందుకు బబుల్ లేదా ఔషధ గుణాలున్న చెట్టు కలపతో చేసిన బ్రెష్ వినియోగించాలి. ఇందులో ప్రాకృతిక గుణాలు అధికంగా ఉంటాయి. వీటివల్ల బ్యాక్టీరియాను సమూలంగా అంతం చేసి..చిగుళ్లను పటిష్టం చేస్తుంది. ఇది పూర్తిగా బయో డిగ్రేడెబుల్.

ఆయిల్ పుల్లింగ్ అనేది ఈ సమస్యకు అద్భుతమైన ప్రక్రియ. ఆయుర్వేదంలో దీనికి విశేష ప్రాధాన్యత ఉంది. నోటి నుంచి బ్యాక్టీరియా, కీటాణువుల్ని తొలగించడంలో సహాయపడుతుంది. చాలామంది కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేస్తుంటారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, జీవాణురోధి గుణాలుంటాయి. పళ్ల ఆరోగ్యం బాగుంటుంది. కొబ్బరినూనెతో పాటు జైతూన్ ఆయిల్ కూడా మంచి ఫలితాలనిస్తుంది. 

రోజూ లేచినవెంటనే..పళ్లు, నాలుక, ముఖం శుభ్రంగా కడగాలి. ఆహార పదార్ధాలే కాకుండా నాలుక వల్ల కూడా నోటి దుర్గంధం వస్తుంది. రోజంతా తినే వివిధ రకాల ఆహార పదార్ధాల వల్ల నాలుకపై వ్యర్ధాలు, బ్యాక్టీరియా, డెడ్‌సెల్స్ పేరుకుపోతుంటాయి. ఫలితంగా శ్వాసలో దుర్గంధం వస్తుంది. అందుకే ప్రతిరోజూ ముఖం, నాలుక, పళ్లు శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. 

శరీరానికి నీళ్లు చాలా అవసరం. నీళ్లు శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి. నీళ్లు ఎక్కువ తాగడం వల్ల శరీరంలో పోషక పదార్ధాలు లభిస్తాయి. మీరు తినే ఆహారంలో పోషకాలు కలవడం వల్ల గ్లూకోజ్ ఉత్పత్తిలో తోడ్పడుతుంది. ఉదయం పరగడుపున రెండు గ్లాసుల నీళ్లు తాగడం వల్ల తాజాదనం కలుగుతుంది. రోజంతా ఎనర్జీ ఉంటుంది అందుకే రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతారు. 

Also read: Belly Fat: బెల్లీ ఫ్యాట్‌ను వేగంగా తగ్గించుకోవాలనుకుంటున్నారా.. ఈ టీని తీసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News