విశాల్ మూవీకి హిందూ సంస్థల సెగ

గ‌త కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వ విధానాల‌పై ఏ చిన్న విమ‌ర్శ చేసినా బీజేపీ అనుబంధ సంస్థలు అస‌హ‌నం వ్యక్తం చేస్తున్నాయి.

Last Updated : May 12, 2018, 04:07 PM IST
విశాల్ మూవీకి హిందూ సంస్థల సెగ

గ‌త కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వ విధానాల‌పై ఏ చిన్న విమ‌ర్శ చేసినా బీజేపీ అనుబంధ సంస్థలు అస‌హ‌నం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవ‌ల పలు మూవీల్లో (విజయ్ నటించిన 'మెర్సెల్' చిత్రం) నోట్ల ర‌ద్దు, జిఎస్టీపై సంభాషణలు ఉండ‌టంతో వాటిని తొల‌గించేంత‌ వ‌ర‌కూ ఆ చిత్రాల ప్రద‌ర్శన‌ను అడ్డుకున్నాయి.

తాజాగా విశాల్, స‌మంత‌లు న‌టించిన త‌మిళ మూవీ 'ఇరుంబు తిరై' మూవీపై హిందూ సంస్థలు ఆగ్రహంతో ఉన్నాయి. ఈ మూవీలో ఆధార్ కార్డు, కేంద్ర ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’పై విమ‌ర్శలు ఉన్నాయి. దీనిపై కొన్ని హిందూ సంస్థలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాయి. అయితే ఈ సినిమా విడుదలను ఆపాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.  సినిమా అంటేనే ఊహాజనితమైనదనీ, నచ్చకపోతే చూడడం మానేయండంటూ పిటిషనర్లకు కోర్టు సూచించింది. సినిమాపై నిరసన వ్యక్తం చేస్తున్న హిందూ సంస్థలు హీరో విశాల్ ఇంటిని ముట్టడించనున్నట్టు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో విశాల్ ఇంటికి పోలీసులు భద్రత కల్పించారు. కాగా, నిన్న విడుద‌లై ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది.

Trending News