Sun rises in Antarctica after 4 months: నాలుగు నెలల చీకటి తర్వాత అంటార్కిటికాలో తొలిసారి సూర్యుడు తొంగిచూశాడు. అంటార్కిటికా ఖండంలో శీతాకాలం ముగియడంతో.. నాలుగు నెలల సుదీర్ఘ అంధకారం తర్వాత మంచు కొండల మధ్యలో నుంచి సూర్యుడు తొంగిచూశాడు. సూర్యుడి రాకను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) అధికారికంగా ప్రకటించింది. కాంకోర్డియా పరిశోధనా స్టేషన్‌లోని 12 మంది సభ్యుల బృందం తాము సూర్యోదయాన్ని చూసినట్లు పేర్కొంది.
ఈ ఏడాది మేలో అంటార్కిటికా ఖండంలో శీతాకాలం ప్రారంభమైంది. శీతాకాలం ముగియడంతో ఆగస్టులో మళ్లీ సూర్యుడు ఉదయించాడు. నాలుగు నెలల తర్వాత అంటార్కిటికాలో తొలి సూర్యోదయానికి సంబంధించిన ఫొటోను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ ఫొటోను వైద్యుడు హన్నెస్ హాగ్సన్ తీశారు. ప్రపంచవ్యాప్తంగా నాలుగు ప్రధాన కాలాలు ఉంటే.. అంటార్కిటికాలో మాత్రం కేవలం రెండే కాలాలు ఉంటాయి. అంటార్కిటికాలో వేసవి, శీతాకాలాలు మాత్రమే ఉంటాయి.
సాధారణంగానే మైనస్ డిగ్రీలు నమోదయ్యే అంటార్కిటికా ఖండంలో మే నెలలో శీతాకాలం మొదలవగానే.. ఉష్ణోగ్రతలు మైనస్ 70, 80 డిగ్రీలకు పడిపోతాయి. ఆ నాలుగు నెలలు సూర్యుడు అస్సలు కనిపించడు. ఆగస్టు వరకు అక్కడ రాత్రి, పగలు చీకటి మాత్రమే ఉంటుంది. పరిశోధకులు ఈ కాలాన్ని 'బంగారు గని'గా అభివర్ణిస్తారు. ఈ సమయంలో సైంటిస్టులు బయోమెడికల్ పరిశోధనలతో పాటు వివిధ అంశాలపై పరిశోధనలు చేస్తారు. బంగారు గని సమయం పరిశోధనలకు మార్గం సుగమం చేసి.. వ్యోమగాములకు సహాయపడే కొత్త అంశాలను అందిస్తుంది.
Also Read: Horoscope Today 23 August 2022: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే.. ఆ రెండు రాశుల వారికి..!
Also Read: Shubman Gill, Sara Tendulkar: శుభ్‌మన్ గిల్, సారా టెండుల్కర్ ఇంకా డేటింగ్‌లో ఉన్నారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook