Virat Kohli: గత కొంతకాలంగా టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ గాడి తప్పారు. ఎప్పుడు సెంచరీలతో హోరెత్తించే కోహ్లీ నుంచి పరుగులు రావడం కష్టంగా మారింది. క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసున్నా..పరుగులు చేయలేక ఔట్ అవుతున్నాడు.విండీస్, జింబాబ్వే పర్యటన నుంచి కోహ్లీకి విశ్రాంతి కల్పించారు. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న అతడు..త్వరలో జరగబోయే ఆసియా కప్‌లో ఆడనున్నాడు.
ఇటు కేఎల్ రాహుల్ పరిస్థితి ఇలాగే ఉంది. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన అతడు ఆ తర్వాత గాయపడ్డాడు. ప్రస్తుతం జింబాబ్వే టూర్‌లోకి అందుబాటులోకి వచ్చాడు. ఐతే ఫామ్‌లోకి వచ్చేందుకు శ్రమించాల్సి ఉంది. జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో ఆడేందుకు అవకాశం రాలేదు. రెండో వన్డేలో ఓపెనర్‌గా వచ్చినా ఒక్క పరుగు చేసి ఎల్బీగా ఔట్ అయ్యాడు. ఇక మూడో వన్డేలో మాత్రం పర్వాలేదనిపించాడు. 30 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
మరో వారం రోజుల్లో ఆసియా కప్ మొదలు అవుతోంది. ఈమెగా టోర్నీలో వీరిద్దరూ టచ్‌లోకి రావాలని భారత అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌పై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆసియా కప్ కంటే..ఈఏడాది చివర్లో జరిగే టీ20 వరల్డ్ కప్‌కు అతడు కీలకమని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాలో జరిగే టోర్నమెంట్‌కు కోహ్లీ అత్యంత అవసరమని తెలిపాడు.
ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన అతడు ఈమేరకు వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ ముఖ్యమైనదే..కానీ తాను ప్రపంచ కప్ కోసం ఎదురుచూస్తున్నానన్నాడు. ఆస్ట్రేలియాలో పిచ్‌లు చాలా బాగుంటాయని..వాటిని కోహ్లీ ఇష్టపడతాడని తెలిపాడు. ఆ పిచ్‌లపై అతడికి మంచి రికార్డు ఉందని..ఆ సమయంలో కోహ్లీ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసి వస్తుందని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.
ఆసియాకప్‌లో అతడు తిరిగి ఫామ్‌లోకి వస్తాడని చెప్పాడు. ఇది కోహ్లీకి, జట్టుకు అత్యంత ముఖ్యమన్నాడు మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ రాణించకపోతే..టీమిండియా ఇతర మార్గాలను వెతుకోవాలని సూచించాడు. శనివారం నుంచి ఆసియా కప్ మొదలు కానుంది. మొదటి మ్యాచ్‌లో శ్రీలంక, అఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య ఫైట్ జరగనుంది. ఆదివారం బిగ్ మ్యాచ్ జరగబోతోంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భారత్, పాక్ మ్యాచ్ దుబాయ్‌లో జరగనుంది.
Also read:Shahid Afridi-Kohli: విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై షాహిద్ అఫ్రిదీ కీలక వ్యాఖ్యలు!
Also read:Mlc Kavitha: కేసీఆర్ ను బద్నాం చేసేందుకు బీజేపీ కుట్ర.. లిక్కర్ స్కాంతో తనకు సంబంధం లేదన్న కవిత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి