Saturn and Jupiter retrograde effect 2022: మనం చేసే పనులను బట్టి ఫలాలను ఇచ్చేవాడు శనిదేవుడు. జ్ఞానానికి కారుకుడు దేవగురు బృహస్పతి. ఈ రెండు గ్రహాలు ప్రస్తుతం తిరోగమనంలో ఉన్నాయి. శని మకరరాశికి అధిపతి. ప్రస్తుతం అదే రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. 23 అక్టోబరు 2022 వరకు శనిదేవుడు ఆ రాశిలోనే ఉంటాడు. ప్రస్తుతం గురుడు మీన రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. గత నెల జూలై 29, 2022న గురుడు మీనరాశిలో తిరోగమనం చేశాడు. ఆ రాశిలోని బృహస్పతి నవంబరు 24 వరకు ఉంటాడు.
ఈ రెండు రాశుల తిరోగమనం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటే.. మరికొన్ని రాశులవారికి అశుభంగా ఉంటుంది. ఈ సమయంలో ఆరు రాశులవారు తీవ్ర ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా మిథునం, తుల, ధనస్సు, మకరం, కుంభం, మీన రాశులవారి జాగ్రత్తగా ఉండాలి. కెరీర్, ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. శనిగ్రహానికి సంబంధించిన వస్తువులను శనివారం దానం చేయడం శుభప్రదంగా ఉంటుంది. గురుదోష నివారణకు విష్ణువును పూజించండి. అతడి పసుపు వస్తువులను దానం చేయండి. పేద విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంచిపెట్టండి.
Also Read: Hartalika Teej 2022: హర్తాళికా తీజ్ ఎప్పుడు? శుభ సమయం, పూజ సామాగ్రి గురించి తెలుసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook