Mars Transit In Taurus 2022: ప్రతి గ్రహం నిర్ధిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. రెండు రోజుల కిందట కుజుడు తన రాశిని మార్చాడు. మేషరాశిని విడిచిపెట్టి కుజుడు వృషభరాశిలోకి (Mars Transit In Taurus 2022) ప్రవేశించాడు. అంగారక గ్రహ సంచారం అన్ని రాశులపై శుభ మరియు అశుభ ప్రభావాలను కలిగిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కుజుడు దాదాపు 45 రోజుల పాటు వృషభ రాశిలో ఉంటాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.
మేషరాశి (Aries): అంగారక సంచారం ఈ రాశివారికి కలిసి వస్తుంది. క్రీడా రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. అదృష్టం తోడై భారీగా డబ్బు సంపాదిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది.
పరిహారం: దుర్గాదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించండి.
వృషభరాశి (Taurus): వృషభ రాశిలో కుజుడు సంచారం వల్ల ఈ రాశివారికి మేలు జరుగుతుంది. వీరు శత్రువులపై విజయం సాధిస్తారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూల సమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇదే మంచి సమయం. ఖర్చు చేసేటప్పుడు తెలివిగా వ్యవహారించండి.
పరిహారం: ప్రతిరోజు పూజ చేయండి.
మిథునం (Gemini): కుజ సంచారం ఈ రాశివారికి ఇబ్బందికరంగా ఉంటుంది. డబ్బు దుబారా అవుతుంది. అనవసరంగా గొడవలు జోలికి వెళ్లకండి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది.
పరిహారం : మంగళవారం ఆంజనేయుడిని పూజించండి.
కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి అంగారక సంచారం వల్ల ప్రమోషన్ వస్తుంది. కొత్త జాబ్ రావచ్చు. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఈ సమయంలో అప్పుల బాధ నుండి ఉపశమనం లభిస్తుంది.
పరిహారం: రోజూ మీ అన్నయ్య ఆశీస్సులు తీసుకోండి.
సింహరాశి (Leo): కుజ సంచారం వల్ల ఈ రాశివారు భారీగా లాభపడతారు. మీ వ్యాపారం విస్తరిస్తుంది. మీకు అదృష్టం ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం.
పరిహారం: హనుమాన్ చాలీసాను ప్రతిరోజూ 7 సార్లు చదవండి.
కన్య రాశి (virgo): అంగారక సంచారం ఈ రాశివారికి ఇబ్బందులను సృష్టిస్తుంది. ఇతరులతో సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోకండి. తొందరపాటు నిర్ణయాలు మీకు సమస్యలు సృష్టించవచ్చు.
పరిహారం: లక్ష్మీ దేవిని ఎర్రటి పువ్వులతో పూజించండి.
తుల రాశి (Libra): కుజుడు తులరాశిలోని 8వ ఇంట్లో సంచరిస్తాడు. దీంతో మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అదృష్టంతో న్యాయపరమైన విషయాలలో విజయం సాధిస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది.ఈ సమయంలో చిరు వ్యాపారుల లాభపడతారు. అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభిస్తుంది.
పరిహారం: క్రమం తప్పకుండా బెల్లం తినండి.
వృశ్చికరాశి (Scorpio); వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పార్టనర్స్ నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. భారీగా లాభాలను ఆర్జిస్తారు.
పరిహారం : హనుమాష్టకాన్ని పఠించండి.
ధనుస్సు (Sagittarius): ఈ సమయంలో ధనుస్సు రాశివారి శుభవార్త వింటారు. మీ జీతం పెరుగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. మీరు ఆర్థికంగా ఇతరులపై తక్కువ ఆధారపడతారు.
పరిహారం: పేద పిల్లలకు ఎరుపు రంగు దుస్తులను దానం చేయండి.
మకరరాశి(Capricron); అంగారక సంచారం మకరరాశి వారికి కలిసి వస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.
పరిహారం: పిల్లలకు ఎరుపు రంగు దుస్తులు దానం చేయండి.
కుంభరాశి (Aquarius): వృషభ రాశిలో కుజ సంచారం మీ గౌరవాన్ని పెంచుతుంది. ఆర్థికంగా లాభపడతారు. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
పరిహారం: క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించండి.
మీనం (Pisces): ఈరాశివారికి ఈ సమయం పూర్తిగా అనుకూలిస్తుంది. కుజ సంచారం ఆరు నెలలపాటు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. కుటుంబ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి.
పరిష్కారం: తల్లికి బెల్లం లేదా మిఠాయిని తినిపించండి.
Also Read: Sun Transit 2022: 11 నెలల తర్వాత సొంతింటికి సూర్యుడు..ఈ రాశివారికి బంపర్ ప్రయోజనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook