Monsoon Health Drink: వర్షాకాలంలో ఆరోగ్యపరంగా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే వర్షాకాలంలో ఎదురయ్యే ఇన్‌ఫెక్షన్లు, రోగాల్నించి ఉపశమనం పొందవచ్చు. దీనికోసం ఏం తినాలి, ఏం తాగాలి..
ఎండాకాలం, చలికాలం కంటే వర్షాకాలం ఆరోగ్యపరంగా చాలా డేంజర్. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, రోగాలు త్వరగా సంక్రమించే సమయమిది ఎందుకంటే వర్షాకాలంలో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల త్వరగా ఇన్‌ఫెక్షన్లు, రోగాలు అంటుకుంటాయి. అందుకే తినే ఆహారం ఎప్పుడూ బలంగా ఉండాలి. దీనికోసం ప్రతిరోజూ సేవించాల్సిన డ్రింక్ బాదం పాలు. బాదంపాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం..
బాదం, పాలలో ఉండే పోషకాలు
బాదంలో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ కే, విటమిన్ ఇ, ప్రోటీన్లు, జింక్, కాపర్ గుణాలున్నాయి. అటు పాలలో ప్రోటీన్లు, కాల్షియం అధికంగా ఉంటాయి. వర్షాకాలం సమయంలో బాదం పాలు తాగడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
వర్షాకాలంలో సాధారణంగా స్కిన్ ఎలర్జీ సమస్య అధికంగా ఉంటుంది. ఎలర్జీ దూరం చేసేందుకు బాదం పాలు తాగితే మంచి ఫలితాలుంటాయి. బాదంపాలలో ఉండే విటమిన్ ఇ ఎలర్జీని దూరం చేస్తుంది. బాదం పాలు రోజూ తాగడం వల్ల ఇమ్యూనిటీ అద్భుతంగా పెరుగుతుంది. ఫలితంగా ఈ సీజన్‌లో వివిధ వ్యాధుల్నించి పోరాడే సామర్ధ్యం వస్తుంది. వర్షకాలంలో బాదం పాలు తాగడం వల్ల..బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు, రోగాల్నించి కాపాడుకోవచ్చు.
బాదం పాలతో జీర్ణక్రియ మెరుగవుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో తరచూ ఎదురయ్యే కడుపు నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. వర్షాకాలంలో కడుపులో నొప్పి, డయేరియా వంటి సమస్యలు పీడిస్తాయి. ఈ క్రమంలో రోజూ బాదంపాలు తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. అటు మలబద్ధకం సమస్య కూడా పోతుంది. ఇక మరో ఉపయోగం జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం పొందడం. బాదం పాలు క్రమం తప్పకుండా రోజూ తాగడం వల్ల మీ జుట్టుకు బలం చేకూరుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది.
Also read: Weight loss Drink: పసుపు, నిమ్మకాయ, అల్లం నీళ్లతో 3-4 వారాల్లోనే అధిక బరువుకు చెక్, ఎలాగంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook