Rakhi and Zodiac Signs: దేశమంతా ఘనంగా జరుపుకునే రాఖీ పండుగ రేపే. అన్నాచెల్లెళ్ల మధ్య అనురాగానికి ప్రతీక ఈ పండుగ. రక్షాబంధన్ నాడు కట్టే రాఖీ రంగుల్లో కూడా జ్యోతిష్యం ఉంది. ఏ రాశివారికి ఏ రంగు మంచిది..మీ సోదరుడికి ఏ రంగు రాఖీ కట్టాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
అన్నాచెల్లెళ్ల పండుగ రక్షాబంధన్ లేదా రాఖీ మొత్తానికి వచ్చేసింది. రేపు అంటే ఆగస్టు 11న దేశమంతా రక్షాబంధన్ వేడుకలు జరుపుకోనుంది. సోదరుడి క్షేమం కోసం సోదరి కట్టే రాఖీ విషయంలో జ్యోతిష్యశాస్త్రం ఏం చెబుతుందో చూద్దాం. జ్యోతిష్యం ప్రకారం రాశిని బట్టి కట్టే రాఖీ రంగు ఉండాలి. అంటే మీ సోదరుడి రాశిని బట్టి మీరు కొన్ని నిర్ధారిత రంగుల రాఖీలు కట్టాల్సి ఉంటుంది. కొన్ని రాశులకు కొన్ని రంగులు సూచిస్తున్నారు జ్యోతిష్య పండితులు. ఏ రాశికి ఏ రంగు మంచిదో ఇప్పుడు పరిశీలిద్దాం..
మేషరాశి Aries గ్రహం మార్స్. అందుకే ఈ రాశివారికి రెడ్ కలర్ రాఖీ కడితే మంచిది. మేషరాశిని బట్టి ఎరుపు రంగు శుభ సూచకం. ఇక వృషభ రాశి Taurus జాతకులకు బ్లూ కలర్ మంచిది. ఈ రాశిలోని తమ సోదరులకు చెల్లెళ్లు బ్లూ కలర్ రాఖీ కడితే మంచిది. ఇక మిధునం Gemini వారి గ్రహం బుధుడు. అందుకే ఈ రాశివారికి గ్రీన్ కలర్ రాఖీ శుభం కల్గిస్తుంది. ఇరువురికీ ప్రయోజనకరం.
ఇక కర్కాటకం Cancer రాశికి గ్రహం చంద్రుడు. అందుకే ఈ రాశివారికి తెలుపు వైట్ కలర్ రాఖీ కడితే బాగుంటుంది. ఇక లియో Leo రాశివారి గ్రహం సూర్యుడు. అందుకే ఈ రాశివారికి రెడ్ లేదా ఎల్లో కలర్ రాఖీ మంచిది. ఇక కన్య Virgo రాశికి అధిపతి బుధుడు. అందుకే ఈ రాశివారికి డార్క్ గ్రీన్ రాఖీ కడితే మంచిది. సోదరుడి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఇక తుల Libra రాశికి అధిపతి శుక్రుడు. అందుకే ఈ రాశివారికి పింక్ కలర్ రాఖీ కడితే మంచిది. ఇరువురి బంధం కలకాలముంటుంది.
ఇక వృశ్చికం Scorpio రాశివారికి అధిపతి మార్స్ అంటే గురు గ్రహం. ఈ రాశివారికి రెడ్ కలర్ రాఖీ కడితే మంచి ఫలితాలుంటాయి. ఇక ధనస్సు Sagittarius రాశివారి అధిపతి శుక్రుడు. ఈ రాశివారికి ఎల్లో కలర్ రాఖీ కడితే మంచిది. సోదరుడి అభివృద్ధి ఉంటుంది. ఇక మకరరాశి Capricorn వారికి అధిపతి శని. అందుకే ఈ రాశివారికి బ్లూ కలర్ రాఖీ కడితే మంచిది. శని ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు. ఇక కుంభం Aquarius రాశివారికి అధిపతి కూడా శనినే. ఈ రాశివారికి డార్క్ పర్పుల్ కలర్ రాఖీ కట్టాలి. ఇక చివరిగా మీనం Pisces రాశివారి అధిపతి జూపిటర్. అందుకే ఈ రాశివారికి ఎల్లో కలర్ రాఖీ కట్టాలంటున్నారు జ్యోతిష్య పండితులు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook