Rakshabandhan 2022: సోదర సోదరీమణుల బంధానికి ప్రతీక రాఖీ పండుగ (Rakhi Festival 2022). ఈ ఏడాది ఈ ఫెస్టివల్ ను ఆగస్టు 11వ తేదీ గురువారం దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. అయితే సోదరులకు భద్ర కాలంలో రాఖీ కట్టడం అశుభం. భద్ర ముహూర్తంలో (Bhadra Muhurtam) రాఖీ ఎందుకు కట్టకూడదు, దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం.
భద్ర ఎవరు?
పంచాంగం ప్రకారం, భద్ర కాలంలో శుభకార్యాల చేయడం నిషిద్దం. అసలు ఈ భద్ర ఎవరంటే.. సూర్యభగవానుడు కూతురు, శని దేవుడి సోదరి. ఈమె కూడా శనిదేవుడి లాగానే కోపం ఎక్కువ. అందుకే బ్రహ్మ ఈమెకు భిన్నమైన స్థానం కల్పించాడు. భద్ర కాలంలో సోదరులకు రాఖీ కట్టకూడదని ప్రజల నమ్మకం.
భద్ర కాలంలోనే శూర్పణఖ రావణునికి రాఖీ కట్టింది
రావణుడి సామ్రాజ్యం అంతం కావడానికి కూడా ఈ భద్ర కాలమే కారణమని చెబుతారు. రక్షాబంధన్ సందర్భంగా భద్ర కాలంలో లంకేశుడికి సోదరి శూర్పణఖ రాఖీ కట్టింది. ఆ తర్వాతే లంకకు చెడుకాలం మెుదలైంది. అనంతర కాలంలోనే రావణుడు రాముడి చేతిలో మరణించాడు.
పెద్దగా ప్రభావం ఉండదు
ఈ సంవత్సరం రక్షా బంధన్ ఆగస్టు 11, గురువారం. గ్రంథాల ప్రకారం, భద్ర మూడు లోకాల్లో సంచరిస్తుందని జ్యోతిష్యులు నమ్ముతారు. ఈసారి పాతాళంలో భద్రుని నీడ పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందువల్ల ఇది భూమిపై ఎటువంటి ప్రభావం చూపదు.
Also Read: Venus Transit 2022: కర్కాటకంలో సూర్య శుక్రుల సంయోగం.. ఈ 3 రాశుల వారికి ధనలాభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook