Horoscope Today August 9th 2022: ఇవాళ శ్రావణ మంగళవారం. స్త్రీలు మంగళగౌరీని పూజిస్తారు. పార్వతీ దేవి అనుగ్రహం కోసం మంగళగౌరీ వ్రతం చేస్తారు. సాధారణ రోజుల్లో అయితే మంగళవారం హనుమంతుడిని పూజిస్తారు. మరి ఈ మంగళవారం ఏయే రాశుల వారి జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...
మేష రాశి (Aries)
చిరు వ్యాపారులు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తూనే పార్ట్ టైమ్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే కోరుకున్నట్లుగానే అలాంటి అవకాశం వస్తుంది. పాత వివాదాలు, గొడవలన్నీ సమసిపోతాయి. చాలా స్ట్రగుల్ తర్వాత ఇప్పుడిప్పుడే మీ జీవితం ప్రశాంతతను సంతరించుకుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడుతాయి. ప్రేమికులకు ఇవాళ అనుకూలమైన రోజు. ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తవచ్చు. ఫుడ్ విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి అన్నివిధాలా బాగుంటుంది.
వృషభ రాశి (Taurus)
ఇవాళ మీకు శుభదినం. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నట్లయితే ఈరోజు ఆ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలి. అనుకోని ఫలితాలు లేదా ఆకస్మిక ధన లాభం మీకు దైవం పట్ల నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. పిల్లల విషయంలో సాయంత్రం నాటికి శుభవార్త వినే అవకాశం ఉంది. రిలేషన్షిప్ ప్రపోజల్స్‌పై ఇవాళ్టికి నిర్ణయాన్ని వాయిదా వేయండి. మానసికంగా కొంత డిస్టర్బ్‌గా ఫీలవుతారు. మిమ్మల్ని సరిగా అర్థం చేసుకునేవారు లేక సతమతమవుతారు. పెళ్లి విషయంలో మీకు అంతా మంచే జరుగుతుంది.
మిథున రాశి (GEMINI)
పోటీ పరీక్షలు రాసిన విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. పని ప్రదేశంలో మునుపటికన్నా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కొన్ని అవనసర ఖర్చులు చేస్తారు. బిజినెస్ చేస్తున్నవారు ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి. కీలక విషయాల్లో మీ సొంత నిర్ణయాల కన్నా జీవిత భాగస్వామి సలహాలను స్వీకరించండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత బాధిస్తాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.
కర్కాటక రాశి (Cancer)
పనిలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు, అవార్డులు దక్కుతాయి. మీ పని పట్ల బాస్ చాలా సంతృప్తితో ఉంటారు. డబ్బు ఖర్చు చేసే విషయంలో ఆచీ తూచీ వ్యవహరించాలి. మీకు పరిచయం లేని వ్యక్తులను బిజినెస్ పార్ట్‌నర్స్‌గా చేర్చుకోవద్దు. పెండింగ్ వర్క్స్ పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో సేల్స్ బాగుంటాయి. మీ బంధువుల్లో ఒకరితో వివాదం తలెత్తవచ్చు. ఏ విషయమైనా ఓపికతో వ్యవహరించండి.
సింహ రాశి (LEO)
ఉద్యోగులకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు లేదా సామాజికపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేవారి నెట్వర్క్ మరింత పెరుగుతుంది. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. ప్రాపర్టీ కొనుగోలు గురించి ఆలోచిస్తున్నట్లయితే.. ఆ పని మీరు సులువుగా చేసేగయలరు. వ్యాపారంలో ఉన్నవారు తండ్రి సలహాలు పాటించండి. ప్రస్తుతం ఉన్న చోటు నుంచి నివాసాన్ని మార్చాలనుకుంటే.. అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.
కన్య రాశి (Virgo)
కలప, ఫర్నీచర్ సంబంధిత వ్యాపారులకు ఇవాళ లాభాలు ఉంటాయి. యువత ఉద్యోగ అవకాశాలు పొందుతారు. చాలాకాలంగా పూర్తి కాని పనులు ఇవాళ్టితో పూర్తయిపోతాయి. వ్యాపారస్తులకు ఇది అనుకూలమైన రోజు. మీ ఆర్థికపరిస్థితి మెరుగవుతుంది. ఇంట్లోని సమస్యలను సులువుగా పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమలో ఉన్నవారు మీ పార్ట్నర్ మనస్సును అర్థం చేసుకుని మెలగాలి.
తులా రాశి (Libra)
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ టైమ్. వారికి ప్రమోషన్ లభించవచ్చు. బదిలీ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. అది మీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయినా అవొచ్చు. ఖర్చు విషయంలో ఇవాళ ఎక్కడా వెనుకాడరు. తాతలు, తండ్రుల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తి ద్వారా చాలా లబ్ది పొందుతారు. ప్రేమలో బ్రేకప్ అయినవారు ఒత్తిడి నుంచి బయటపడుతారు. మీ పట్ల మీరు ఫోకస్‌గా ఉండాలి. అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లాలి.
వృశ్చిక రాశి (Scorpio)
మీరు చేపట్టిన పని సక్సెస్ అవుతుంది. అది కుటుంబ సభ్యుల్లో మీ పట్ల గౌరవాన్ని మరింత పెంచుతుంది. మీ కోసం వారు చిన్నపాటి పార్టీ ఏర్పాటు చేస్తారు. ఆర్థికపరంగా అంతా బాగుంటుంది. ఇవాళ మీ చేతికి కొంత సీక్రెట్ మనీ అందుతుంది. అది ఎక్కడినుంచి వస్తుందో మీకే తెలియకపోవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించేందుకు సిద్ధమవుతారు.
ధనుస్సు రాశి (Sagittarius)
కోర్టు వివాదాల్లో తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడి పెడితే ఆశించిన లాభం ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఐక్యత ఏర్పడుతుంది. ఉన్నత విద్యకు ప్లాన్ చేసుకునే విద్యార్థులకు శుభసమయం. వివాహితులు జీవితభాగస్వామితో తగిన సమయం గడపాలి. కొత్త స్నేహితులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అధిక వ్యాయామం మానసిక అలసటకు గురిచేస్తుంది. తలనొప్పి, జ్వరం రావొచ్చు.
మకర రాశి (Capricorn)
ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యువతకు గుడ్ న్యూస్ అందుతుంది. ఇవాళ అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. ఆర్థికపరమైన ప్రయోజనాలు పొందుతారు. మీ కష్టానికి తగిన ఫలితం ఏదో ఒక రూపంలో పొందుతారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ లాభదాయకంగా ఉండొచ్చు. ప్రేమికుల మధ్య ప్రేమ బంధం మరింత బలపడుతుంది. పెళ్లి విషయంలో ఇప్పుడిప్పుడే చర్చలు ప్రారంభిస్తారు.
కుంభ రాశి (Aquarius)
ఇదివరకు మీకు పరిచయం లేని వ్యక్తుల నుంచి ఇవాళ మీకు సాయం అందుతుంది. బిజినెస్ విస్తరణకు కొత్త ప్లాన్స్ రూపొందిస్తారు. తల్లిదండ్రుల నుంచి మీకు ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబంలో గొడవలు, వివాదాలు ఉంటే సద్దుమణుగుతాయి. ఆఫీసులో సీనియర్ల సాయంతో వివాదాల నుంచి బయటపడుతారు. ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది.
మీన రాశి (Pisces)
మీకు రావాల్సిన డబ్బు అందకుండా నిలిచిపోతుంది. తిరిగి ఆ డబ్బును పొందేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. డైలీ వర్క్‌లో కొన్ని మార్పులు చేసుకుంటారు. వ్యాపారస్తులకు ఇది శుభ సమయం. ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది. ఇంట్లో వివాదాలు సద్దుమణుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయ ప్రేమ బంధం బలపడుతుంది. తండ్రీకొడుకుల మధ్య మంచి బంధం ఉంటుంది. ప్రియుడు లేదా ప్రియురాలితో గొడవ సమసిపోతుంది.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)
Also Read: లాల్ సింగ్ చద్దా’ మొదలు కార్తికేయ 2 దాకా.. ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలివే!
Also Read: Gorantla Madhav Controversy: గోరంట్ల మాధవ్ విషయంలో టీడీపీకే షాకిచ్చిన సజ్జల రామకృష్ణా రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook