/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

హైదరబాద్: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2018లో భాగంగా శనివారం ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియంలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ఢిల్లీ డేర్ డెవిల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. కాగా, మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ మొదలుపెట్టిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవ‌ర్లకు గాను ఐదు వికెట్ల నష్టానికి 163 ప‌రుగులు చేసింది.164 ప‌రుగుల విజ‌యల‌క్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్లలో ఒక బంతి మిగిలి (19.5)ఉండ‌గానే మూడు వికెట్లు నష్టపోయి 164 ప‌రుగులు చేసింది. దీంతో ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీపై హైద‌రాబాద్ విజ‌యం సాధించింది. ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏడో విజయం నమోదు చేసి ఐపీఎల్ 2018 పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ గెలుపుతో హైదరాబాద్ ప్లేఆఫ్‌కు మరింత చేరువైంది.

మ్యాక్స్‌వెల్‌ (2), పృథ్వీ షా (65), శ్రేయాస్ అయ్యర్ (44), నామ‌న్ ఓఝా (1), పంత్ (18), విజ‌య్ శంక‌ర్‌(23), క్రిష్టిన్ (7) ప‌రుగుల‌తో రాణించ‌డంతో ఢిల్లీ జట్టు163 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. ఆతరువాత బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టులో పాండే (21), యూసుఫ్‌ పఠాన్‌  (27) విలియమ్స్ (32) , ధావన్ (33) హ‌లెస్ (45) ప‌రుగుల‌తో రాణించడంతో జట్టు  విజయం సాధించింది.

Section: 
English Title: 
IPL 2018 - SRHvDD: Rashid Khan stars again as Sunrisers Hyderabad climb to top of table
News Source: 
Home Title: 

స‌న్‌రైజ‌ర్స్‌కు ఐపీఎల్ పట్టికలో అగ్రస్థానం

ఏడు వికెట్ల తేడాతో స‌న్‌రైజ‌ర్స్‌ ఏడో విజయం
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
స‌న్‌రైజ‌ర్స్‌కు ఐపీఎల్ పట్టికలో అగ్రస్థానం