CWG 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు రాణిస్తున్నారు. రోజురోజుకు పతకాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా తెలంగాణ అమ్మాయి, ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ స్వర్ణం సాధించింది. 48-58 కేజీల విభాగంలో విజయం సాధించింది. నార్తన్ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌న్యూయ్‌పై గెలుపు బావుట ఎగురవేసింది. దీంతో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. మొత్తంగా స్వర్ణాల సంఖ్య 17 కాగా..పతకాల సంఖ్య 48గా ఉంది.
పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి వచ్చింది. అందులో 17 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇటీవల ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్‌లోనూ నిఖత్ జరీన్ విజేతగా నిలిచింది. భారత్‌కు మరో స్వర్ణం రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కామన్వెల్త్ గేమ్స్‌లో నిఖత్ జరీన్‌కు స్వర్ణం రావడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి పతకం తెచ్చిన జరీన్‌కు అభినందనలు తెలిపారు.
జరీన్ గెలుపుతో తెలంగాణ కీర్తి ప్రపంచవ్యాప్తం అయ్యిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ఎప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. తొలిసారి టర్కీలో జరిగిన 2011 ప్రపంచ జూనియర్, యూత్ ఛాంపియన్ షిప్‌లో నిఖత్ జరీన్ స్వర్ణం సాధించింది. 2014 నేషనల్ కప్‌లో పసిడి, 2015 జాతీయ సీనియర్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణం సొంతం చేసుకుంది. 2016 దక్షిణాసియా ఫెడరేషన్ క్రీడల్లో కాంస్యం, 2018 సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగిన టోర్నీలో స్వర్ణం సాధించింది
2019 థాయ్‌లాండ్ ఓపెన్‌లో రజతం, 2019, 2022ల్లో స్ట్రాంజా మెమోరియల్‌లో పసిడి, 2022 మే నెలలో ప్రపంచ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణం సాధించింది.
CWG 2022: Boxer Nikhat Zareen clinches gold, defeats Carly Naul in Light Flyweight category
Read @ANI Story | https://t.co/uwbq2A8HMS#NikhatZareen #CWG22 #CarlyNaul #CommonwealthGames2022 pic.twitter.com/HTNaYShSjI
— ANI Digital (@ani_digital) August 7, 2022
Also read:Minister KTR: చేనేతపై జీఎస్టీ అంటే నేతన్నకు మరణ శాసనమే..పునరాలోచించాలన్న మంత్రి కేటీఆర్..!
Also read:Viral Video: రెస్ట్ రూమ్‌కు వెళ్తున్నారా..తస్మాత్ జాగ్రత్త..ఎందుకో వీడియో చూడండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook