Rajgopal Reddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీలో చేరనున్నారా? కాంగ్రెస్ పై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

KomatiReddy Rajgopal Reddy: తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది.. ఎమ్మెల్యే పదవిని ఎందుకు వదుకుంటున్నారు.. ఉప ఎన్నికలో ఏం ప్రయోజనం.. తెలంగాణలో భవిష్యత్ ఏ పార్టీది అన్న అంశాలపై జీ తెలుగు న్యూస్ ఎడిటర్  భరత్ కుమార్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Written by - Srisailam | Last Updated : Aug 3, 2022, 04:36 PM IST
  • ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజీనామా
  • కాంగ్రెస్ పై సంచలన ఆరోపణలు
  • ఎంపీ వెంకట్ రెడ్డి కూడా బీజేపీలో చేరుతారా?
Rajgopal Reddy: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీలో చేరనున్నారా? కాంగ్రెస్ పై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

KomatiReddy Rajgopal Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొన్ని రోజులుగా ఆయన చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. చివరికి అదే నిజమైంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే ఏ పార్టీలో చేరేది ఆయన ఇంకా ప్రకటించలేదు. కాని తెలంగాణలో బీజేపీతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. కేసీఆర్ ను ఓడించే సత్తా కూడా బీజేపీకే ఉందన్నారు. దీంతో కమలం పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తోంది. బీజేపీ ఇచ్చే కాంట్రాక్టుల కోసమే పార్టీ మారుతున్నారని ఆరోపిస్తోంది. మోడీ- అమిత్ షా ఇచ్చే కుక్క బిస్కెట్ల కోసమే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది.. ఎమ్మెల్యే పదవిని ఎందుకు వదుకుంటున్నారు.. ఉప ఎన్నికలో ఏం ప్రయోజనం.. తెలంగాణలో భవిష్యత్ ఏ పార్టీది అన్న అంశాలపై జీ తెలుగు న్యూస్ ఎడిటర్  భరత్ కుమార్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన భవిష్యత్ కార్యాచరణతో పాటు తెలంగాణ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. సీఎం కేసీఆర్ పనితీరుతో పాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్రమైన కామెంట్లు చేశారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. తాను ఢిల్లీలో అమిత్ షాను కలిసిన కొన్ని గంటల్లోనే ఐదేళ్లుగా పెండింగులో ఉన్న గటుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. తన రాజీనామాతో నియోజకవర్గంలోని సమస్యలు తీరితే తనకు అదే చాలన్నారు రాజగోపాల్ రెడ్డి.

గత మూడున్నర ఏళ్లుగా మునుగోడుకు కేసీఆర్ సర్కార్ రూపాయి నిధులు ఇవ్వలేదన్నారు రాజగోపాల్ రెడ్డి. ఎమ్మెల్యే ఫండ్ కూడా రాలేదన్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా వ్యక్తిగతంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కొవిడ్ సమయంలో నియోజకవర్గ ప్రజలకు అండహా ఉన్నానన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఉప ఎన్నిక వస్తేనే అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. హుజురాబాద్, నాగార్జునసాగర్ , దుబ్బాకలో అదే జరిగిందన్నారు. అందుకే నన్ను గెలిపించిన మునుగోడు ప్రజల కోసం ఇంకా 18 నెలల సమయం ఉన్నా రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఉప ఎన్నిక ద్వారా అయినా నిధులు వస్తే తన ప్రజలకు ప్రయోజనం కల్గుతుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు మేలు కోసమే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. అధికార పార్టీ ఆహ్వానించినా వెళ్లలేదన్నారు. మంత్రి పదవి ఆఫర్ చేసినా అవినీతి ప్రభుత్వంలో చేరడం ఇష్టం లేక తిరస్కరించానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నయీం బెదిరింపులకు భయపడలేదన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఉద్దండులు ఓడిపోయినా మునుగోడులో తాను ఘనవిజయం సాధించానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మునుగోడులో కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి తానెప్పుడు ఎప్పుడు ద్రోహం చేయలేదన్నారు రాజగోపాల్ రెడ్డి.  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది.. వచ్చేసారి గెలిచే అవకాశం లేదని చెప్పారు. తనకు కాంగ్రెస్ లో పొమ్మనకుండా పొగ బెట్టారని అన్నారు.

రాజగోపాల్ రెడ్డి బీజేపీ ద్వారా ఆర్థికంగా బలపడ్డారంటూ తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. జార్ఖండ్ లో 22 వేల కోట్ల మైనింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తమ సంస్థకు ఆ కాంట్రాక్ట్ గ్లోబట్ టెండర్ ద్వారానే దక్కిందన్నారు. దేశంలో ఎక్కడైనా కాంట్రాక్ట్ పనులు చేసుకోవచ్చన్నారు. బీజేపీ ద్వారా తనకు ఆర్థిక సాయం అందిందని నిరూపిస్తే రాజకీయ సన్యాయం చేస్తానని రాజగోపాల్ రెడ్డి సవాల్ చేశారు. కేసీఆర్ మేఘా సంస్థకు కాంట్రాక్టులు ఇచ్చినట్లు కేంద్ర ప్రాజెక్టులకు అవకాశం ఉండదన్నారు. రాజకీయాలకు వ్యాపారానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. స్వార్ధం కోసం, పదవి కోసం కాదు.. మునుగోడు ప్రజల కోసమే రాజీనామా చేస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.  బీజేపీతోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. భువనగిరి ఎంపీ, తన  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురించి కీలక కామెంట్లు చేశారు రాజగోపాల్ రెడ్డి. వెంకట్ రెడ్డి ప్రజల మనిషి అన్నారు. తెలంగాణ కోసం  మంత్రి పదవిని త్యాగం చేశారని చెప్పారు. తాను చేసేది మంచి పని కాబట్టి.. వెంకట్ రెడ్డి కూడా తనను అర్ధం చేసుకుంటారని తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా త్వరలో కీలక నిర్ణయం నిర్ణయం తీసుకుంటారంటూ బాంబ్ పేల్చారు.

జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ కుమార్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ క్లూజివ్ పూర్తి ఇంటర్వ్యూ సాయంత్రం 8 గంటలకు..  

Also read:AP 10th Supplementary Results: పది సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..రిజల్ట్స్‌ ఇలా చెక్ చేసుకోండి..!  

Also read:China vs America: చైనా, అమెరికా మధ్య యుద్ధం తప్పదా.. తైవాన్‌పై ఎవరిది పైచేయి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News