Bhadrapada Amavasya 2022: ప్రతి నెల పౌర్ణమి, అమావాస్య వస్తాయి. వీటిలో కొన్నింటికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజున స్నానానికి, దానానికి విశేష ప్రాధాన్యత ఉంది. అలాంటి వాటిల్లో భాద్రపద అమావాస్య చాలా ముఖ్యమైనది. ఈ అమావాస్యను ఆగస్టు 27వ తేదీ శనివారం జరుపుకోనున్నారు. భాద్రపద మాసంలో శ్రీకృష్ణుడిని (Lord Krishna) పూజిస్తారు.
భాద్రపద అమావాస్య 26 ఆగస్టు 2022 మధ్యాహ్నాం 12:24కు ప్రారంభమై,,, 27 ఆగస్టు మధ్యాహ్నాం 01:47 వరకు ఉంటుంది.
ఈ అమావాస్యను రకరకాల పేర్లుతో పిలుస్తారు. దీనినే కుషోత్పతిని అమావాస్య, పిఠోర అమావాస్య (Pithori amavasya 2022) అని పిలుస్తారు. ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి పుణ్యస్నానం ఆచరించి...సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. అనంతరం పితృదేవతలకు పిండ ప్రదానం చేయండి. ఇలా చేయడం వల్ల మీరు కాలసర్ప దోషం నుండి బయటపడవచ్చు.
అంతేకాకుండా ఈ వ్రతాన్ని చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. అందుకే వివాహిత స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ అమావాస్యను ఉత్తర భారతదేశంలో మరియు దక్షిణ భారతదేశంలో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో దీనిని పిథోరి అమావాస్యగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఈ అమావాస్యను పొలాల అమావాస్య అని పిలుస్తారు.
Also Read: Raksha Bandhan 2022: రాఖీ పండుగ ఆగస్టు 11 లేదా ఆగస్టు 12?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook