అమరావతి: ఏపీ ఎడ్‌సెట్-2018 ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏపీ ఎడ్‌సెట్ 2018 ఫలితాలను విడుదల చేశారు. ఎడ్‌సెట్‌కు సంబంధించిన ఫలితాలను ఆర్టీజీఎస్ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఏపీ ఎడ్‌సెట్‌లో 96.75 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎడ్‌సెట్ పరీక్షకు 7,679 మంది అభ్యర్థులు హాజరు కాగా .. 7,430 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
రాష్ట్రంలో మొత్తం 39 వేల బీఈడీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎడ్‌సెట్ పరీక్షలు వెంకటేశ్వర యూనివర్శిటీ పరిధిలో జరిగాయి. మార్చి 5న నోటిఫికేషన్ ఇచ్చి, ఏప్రిల్ 19న పరీక్ష నిర్వహించారు. ఎడ్‌సెట్ పరీక్ష కోసం మొత్తం 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ర్యాంక్ కార్డుల కొరకు sche.ap.gov.inను సందర్శించవచ్చు
పరీక్ష ఫలితాల కోసం:
ర్యాంక్ కార్డు కోసం:
ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల