Latest Survey: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారా? జగన్ సంక్షేమ మంత్రం పనిచేస్తుందా? తెలంగాణలో టీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా? సీఎం కేసీఆర్ పాలనపై జనాలు ఆగ్రహంగా ఉన్నారా? కేంద్రంలో మోడీ సర్కార్ పనితీరు ఎలా ఉంది? తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో విపక్షాల పరిస్థితి ఏంటీ? ఇదే కొన్ని రోజులుగా జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ. ఈ అంశాలపైనే తాజాగా ఇండియా టుడే దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. దేశ్ కా ఆవాజ్ పేరుతో నిర్వహించిన సర్వే ఫలితాలను ఇండియా టుడే విడుదల చేసింది. దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అంచనా వేసింది. రాష్ట్రాల వారీగా సర్వే ఫలితాలను రిలీజ్ చేసింది. ఇండియా టుడే దేశ్ కా ఆవాజ్ సర్వేలో సంచలన ఫలితాలు వచ్చాయి.
ఇండియా టుడే తాజా సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తేలింది. దేశంలో మొత్తం 543 లోక్ సభ సీట్లు ఉండగా ఎన్డీఏ కూటమికి ఏకంగా 362 సీట్లు వస్తాయని ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. గత ఎన్నికల కంటే ఇది అధికం. 2019 ఎన్నికల్లో బీజేపీ అలయన్స్ కు 353 సీట్లు వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యూపీఏ కూటమికి వందలోపే ఆగిపోనుందని తేలింది. యూపీఏకు కేవలం 97 సీట్లు వస్తాయని ఇండియా టుడే సర్వేలో తేలింది. ఇక కాంగ్రెస్ కు 2019 కంటే సీట్ల సంఖ్య తగ్గనుంది. కాంగ్రెస్ కు కేవలం 39 సీట్లు వస్తాయని సర్వేలో స్పష్టమైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు 52 లోక్ సభ సీట్లు వచ్చాయి. యూపీఏ కూటమిలో తమిళనాడులోని డీఎంకేకు 25 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. బెంగాల్ లోని అధికార టీఎంసీ పార్టీకి 26 సీట్లు రానుండగా.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 6, ఎస్పీకి కేవలం రెండు లోక్ సభ సీట్లు మాత్రమే వస్తాయని సర్వే ఫలితాల్లో వెల్లడైంది. ఢిల్లీ, పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ పార్టీకి ఐదు సీట్లు వస్తాయని తేలింది. యూపీలో మొత్తం 80 సీట్లకు బీజేపీకే 76 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కనిపించింది. అయితే 2019తో పోల్చితే ా పార్టీకి సీట్లు తగ్గనున్నాయి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 19 సీట్లు రానున్నాయి. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 23 సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో మూడు సీట్లు సాధించిన టీడీపీ ఆరు సీట్లు గెలుస్తుందని సర్వే వెల్లడించింది. ఏపీలో బీజేపీ ఖాతా తెరవదని సర్వేలో స్పష్టమైంది. అయితే ఇండియా టుడే సర్వేలో జనసేన ప్రస్తావనే లేదు. ఓట్ల శాతం కూడా వైసీపీకి గతంలో కన్నా కొంత తగ్గనుంది.
తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పై ప్రజాగ్రహం తీవ్రంగా ఉందనే ప్రచారం సాగుతుండగా.. ఇండియా టుడే సర్వేలోనూ అదే స్పష్టమైంది. 2019 గంటే ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు దాదాపు 8 శాతం ఓట్లు తగ్గనున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఇది దాదాపు 12 శాతంగా ఉంది. ఎంపీ సీట్ల విషయానికి వస్తే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 9 సీట్లు గెలవగా.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 8 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. గతంలో కంటే రెండు సీట్లు అధికంగా బీజేపీకి ఆరు సీట్లు రానున్నాయి. 2019లో కాంగ్రెస్ మూడు సీట్లు గెలవగా.. ఈసారి కేవలం రెండు వస్తాయనే తేలింది. హైదరాబాద్ సీటును ఎంఐఎం నిలబెట్టుకోనుందని ఇండియా టుడే సర్వేలో స్పష్టమైంది. ఓట్ల శాతం చూస్తే 2019 లోక్ సభ ఎన్నిక్లలో టీఆర్ఎస్ కు 42 శాతం ఓట్లు రాగా.. తాజా సర్వేలో అది 34 శాతానికి పడిపోయింది. బీజేపీకి 2019లో కేవలం 20 శాతం ఓట్లు రాగా తాజా సర్వేలో అది ఏకంగా 39 శాతానికి పెరిగింది. బీజేపీ ఓటింగ్ 19 శాతం పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి 2019 లోక్ సభ ఎన్నికల్లో 30 శాతం ఓట్లు రాగా తాజా సర్వేలో అది కేవలం 14 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ ఓట్ల శాతం ఏకంగా 16 శాతం తగ్గింది.
Read also: KTR: కేటీఆర్ బర్త్ డే వేడుకలకు రాలేదని ఉద్యోగులకు నోటీసులు.. విమర్శలు రావడంతో వెనక్కి
Read also: Hyderabad Rains: హైదరాబాద్ లో మళ్లీ కుండపోత.. లోతట్టు ప్రాంతాల్లో భయంభయం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
India Today Survey:కేంద్రంలో బీజేపీ హవా.. తెలుగు రాష్ట్రాల్లో సంచలన ఫలితాలు! ఇండియా టుడే లేటెస్ట్ సర్వే..