Singer Kalpana wanted commits suicide after marriage breakup: సింగర్ 'కల్పన' గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మధురమైన గాత్రంతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన గాయకురాలు. సంగీతంపై మక్కువతో ఐదేళ్ల నుంచే పాటలు పాడటం ప్రారంభించిన కల్పన.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాటలు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జానపద, పాశ్చాత్య, కర్ణాటక, హిందూస్థానీ సంగీతం ఏదైనా తనదైన శైలిలో అలరిస్తారు. కెరీర్ పరంగా భారీ సక్సెస్ సాధించిన కల్పన జీవితంలో ఎంతో విషాదం ఉంది. తన జీవితంలో జరిగిన సంఘటనలతో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నారట.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్పన పలు విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. రామాయణంలో తాటకి పాట పాడటంతో.. తనకు రాక్షసి అని ముద్దు పేరు వచ్చిందని తెలిపారు. తన సినీ కెరీర్ ప్రారంభమే బాలనటిగా మొదలయ్యిందని.. తమిళంలో మూడున్నరేళ్లకే నటించన్నారు. మలయాళం, తెలుగులో నటించానని చెప్పారు. సినిమా షూటింగ్‌లకు వాడే లైటింగ్ ఇబ్బంది కారణంగానే నటించడం మానేశానని కల్పన తెలిపారు.
జీవితంలో జరిగిన సంఘటనలతో కల్పన ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నారట. '25 ఏళ్లుగా పాటలు పాడుతున్నా. ఎన్నో వేధింపుల అనంతరం 2010లో వివాహబంధంయూ ముగింపు పలికా. అప్పుడు ఒక పాప ఉంది, ఉద్యోగం లేదు. సర్వస్వము కోల్పోయిన నేను ఓ సమయంలో చనిపోవాలనుకున్నా. అప్పుడు సింగర్ చిత్రమ్మ గారు చాలా ధైర్యం చెప్పారు. ఆత్మహత్య చేసుకోవడానికి పుట్టావా? అని ప్రశ్నించారు. ఇక్కడ పాటల పోటీ జరుగుతోంది, అందులో పాల్గనమని చెప్పారు' అని కల్పన తెలిపారు.
'చిత్రమ్మ గారు సరదాగా అంటే నేను నిజంగానే వేళ్లా. అప్పటి వాకు నాకు మలయాళం కూడా తెలియదు. కానీ టైటిల్ గెలవాలనే కసి మాత్రం ఉండేది. నా కుమార్తె కోసం కస్టపడి విల్లా గెలవాలనుకున్నాను. నేను పోటీలో పాల్గొనడం వలన ఇండస్ట్రీలో పరువు పోయిందని చాలా మంది చాలా మాటలు అన్నారు. మా తల్లిదండ్రులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇవేమి పట్టించుకోకుండా.. కష్టపడి పోటీ గెలుపొందా. ఎవరూ సహాయం చేయలేదు. చీకటిలో ఒంటరి పోరాటం చేశా. ఆ విజయం నాలో చాలా మార్పు తీసుకొచ్చింది' అని సింగర్ కల్పన చెప్పుకొచ్చారు.
Also Read: థియేటర్‌లో సినిమా చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.