Kerala Students Laptop Protest: కేరళలో కాలేజీ విద్యార్థుల వింత నిరసన అందరినీ ఆలోచింపజేసింది. అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ల్యాప్‌టాప్ నిరసన తెలిపారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తిరువనంతపురం మేయర్ సందర్శనకు కారణమయ్యింది. అసలు ఏం జరిగిందంటే.. అబ్బాయిల ఒళ్లో అమ్మాయిలు కూర్చున్నారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. అబ్బో.. కలికాలం.. పోయేకాలం.. ఇదేం రోగం అనుకుంటున్నారా ? అబ్బాయిలు, అమ్మాయిలు ఇలా ఫోటోలకు ఫోజులివ్వడమేంటనుకుంటున్నారా ? ఇదో తరహా నిరసన. ల్యాప్‌టాప్ నిరసన. ఒకరి ఒళ్లో ఒకరు కూర్చొని తెలిపే నిరసనే ల్యాప్‌టాప్ నిరసన.
ఓ కాలేజీలో చదివే విద్యార్థులంతా ఇలా నిరసన తెలిపారు. తమ స్వేచ్ఛను కాలేజీ యాజమాన్యం హరించిందంటూ ఆక్షేపించారు. తాము కూర్చునే కుర్చీలను మధ్యలోకి కట్ చేశారని.. అమ్మాయిలు, అబ్బాయిల మధ్య అంతరం సృష్టించారని ఆరోపించారు. అయినా తాము ఎలా కూర్చుంటామో వాళ్లకు చూపిస్తున్నామని, తమ ఈ నిరసనను చూసి వాళ్లు కళ్లు తెరవాలని డిమాండ్ చేశారు.
కేరళలో జరిగిందీ సంఘటన. తిరువనంతపురంలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కాలేజీ సమీపంలోని వెయిటింగ్ బస్ షెల్టర్‌లో విద్యార్థినీ విద్యార్థులు ఇలా ల్యాప్‌టాప్ నిరసన తెలిపారు. కాలేజీకి వచ్చే విద్యార్థులు రోజూ ఈ బస్ షెల్టర్‌లో బస్సుకోసం వెయిట్ చేస్తుంటారు. అయితే, ఆ బస్‌స్టాప్‌లో అమ్మాయిలు, అబ్బాయిల ప్రవర్తన సరిగా ఉండటంలేదని పెద్ద బెంచీని మూడు ముక్కలుగా విడగొట్టారు. ఒక్కో ముక్కపై ఒక్కరు మాత్రమే కూర్చునే విధంగా కట్ చేశారు.
అయితే, ఈ పరిణామాన్ని విద్యార్థులు జీర్ణించుకోలేకపోయారు. తాము రోజూ స్నేహపూరితంగా కలిసి కూర్చోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈ పనిచేశారని భావించారు. ఒక్కో కుర్చీపై ఒక విద్యార్థి కూర్చోగా.. వాళ్ల ఒళ్లో అమ్మాయిలు కూర్చొని నిరసన తెలిపారు. తమకు స్త్రీ, పురుష వివక్ష లేదని నినాదాలు చేశారు. లింగ వివక్షను కాలేజీ యాజమాన్యం విడనాడాలని హితవు పలికారు. ఇలా చేయడం వల్ల తమలో భేద భావన వస్తుందని, తమ స్థైర్యాన్ని ఇది దెబ్బ తీస్తుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఆలోచనలు తమ స్నేహాన్ని దెబ్బతీయలేవని అన్నారు.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో, కాలేజీ వర్గాలు స్పందించాయి. విద్యార్థినులపై వేధింపులు నివారించేందుకే ఈ మార్పులు చేశామని కాలేజీ యాజమాన్యం తెలిపింది. కాలేజీ విద్యార్థులే కాకుండా, బయటివాళ్లు కూడా అక్కడ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. మరోవైపు.. తిరువనంతపురం మేయర్ ఆర్య ఎస్.రాజేంద్రన్ ఆ బస్‌షెల్టర్ దగ్గరికి వచ్చి పరిశీలించారు. కాలేజీ యాజమాన్యం బెంచీలను కట్ చేయడం సమంజసం కాదన్నారు. విద్యార్థినులు, విద్యార్థులు కలిసి కూర్చోవడంపై రాష్ట్రంలో నిషేధం లేదన్నారు. అంతేకాదు.. విద్యార్థినీ విద్యార్థుల ల్యాప్ టాప్ నిరసనలను అభినందించారు. స్థానిక అధికారులు విద్యార్థుల పక్షమే ఉన్నారని తెలిపారు. ఈ బస్‌షెల్డర్ స్థానంలో ఆధునిక సదుపాయాలతో కూడిన కొత్త షెల్టర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
Also Read : Cock and Hen Viral Video: బీరు తాగిన కోళ్లు, తాగిన మైకంలో గాల్లో ఎగిరెళ్లిన కోడి పుంజు..వీడియో వైరల్
Also Read : OMG Video: దించకుండా బీర్ కొట్టి.. బాహుబలి ఎద్దుతో ఫైట్ కు దిగిన మేక.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook