/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Ganesh Immersion:హైదారాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవంపై మళ్లీ వివాదం మొదలైంది. హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని ప్రభుత్వం చెబుతుండగా.. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మాత్రం తగ్గేదే లే అంటోంది. గణేష్ విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది.  హుస్సేన్ సాగర్ లొనే విగ్రహాలను నిమజ్జనం చే,ి చేసి తీరుతామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు  భగవంత్ రావు చెప్పారు.  విగ్రహాల తయారీ విషయ లో హై కోర్టు తీర్పును  ఆయన స్వాగతించారు.విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం, పోలీసులు జోక్యం చేసుకోవద్దని భగవంత్ రావు హెచ్చరించారు. నిమజ్జనోత్సవానికి ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రభుత్వం, పోలీసుల నుంచి ఎలాంటి అడ్డంకులు ఎదురైనా తీవ్ర పరిణామాలు ఉంటాయని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి హెచ్చరించింది.ఇక మండప నిర్వహకులు ఎవరికి ఇబ్బంది లేకుండా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని భగవంత్ రావు సూచించారు.

వినాయక విగ్రహాల తయారీ దారులకు తెలంగాణ హైకోర్టు గురువారం గుడ్ న్యూస్ చెప్పింది. వినాయక నిమజ్జనంపైనా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాల తయారీపై నిషేధం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పీవోపీ విగ్రహాలను జీహెచ్​ఎంసీ ఏర్పాటు చేసే ప్రత్యేక కొలనుల్లో మాత్రమే నిమజ్జనం చేయాలని హైకోర్టు ఆదేశించింది. పీవోపీ విగ్రహాల నిషేధంపై గతంలో కేంద్ర పీసీబీ మార్గదర్శకాలు జారీ చేసింది, వాటిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. విగ్రహ తయారీదారులు దాఖలు చేసిన పిటిషన్​పై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. పీవోపీ విగ్రహాలు నిషేధిస్తూ ప్రభుత్వం ఎలాంటి జీవో ఇవ్వలేదని తెలిపింది హైకోర్టు. విగ్రహాల ఎత్తు తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ అభ్యర్థననూ తిరస్కరించింది.
వివాదమంతా విగ్రహాల తయారీపై కాదని, కేవలం నిమజ్జనానికి సంబంధించిన ఈ విషయంలో మాత్రమే వస్తుందని హైకోర్టు తెలిపింది.  

Read also: Hyderabad Rains: హైదరాబాద్ లో దంచి కొడుతున్న వర్షం.. బయటికి రావొద్దని పోలీసుల హెచ్చరిక  

Read also: CBSE 12th results 2022: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండి ఇలా..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

 

Section: 
English Title: 
Bhagyanagar Ganesh Utsava Samiti Key Statement Over Ganesh Immersion On Hussain Sagar
News Source: 
Home Title: 

Ganesh Immersion:హుస్సేన్ సాగర్ లోనే వినాయ విగ్రహాల నిమజ్జనం.. పోలీసులకు ఉత్సవ సమితి వార్నింగ్
 

Ganesh Immersion:హుస్సేన్ సాగర్ లోనే వినాయక విగ్రహాల నిమజ్జనం.. పోలీసులకు ఉత్సవ సమితి వార్నింగ్
Caption: 
FILE PHOTO ganesh festival
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Ganesh Immersion:హుస్సేన్ సాగర్ లోనే విగ్రహాల నిమజ్జనం.. ఉత్సవ సమితి కీలక ప్రకటన
Srisailam
Publish Later: 
No
Publish At: 
Friday, July 22, 2022 - 16:54
Request Count: 
83
Is Breaking News: 
No