CM Jagan: గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతోందని..సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రానున్న 48 గంటల్లో ప్రతి ఇంటికి రూ.2 వేల సహాయం అందాలన్నారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయాలు, కేజీ పామాయిల్‌తో కూడిన రేషన్ కిట్ పంపిణీ చేయాలన్నారు సీఎం.
గ్రామ,వార్డు సచివాలయాల వ్యవస్థలను కూడా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు. వరద బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు. ముంపు ప్రాంతాల్లో ఏదో జరుగుతోందని టీడీపీ, చంద్రబాబు, పచ్చ మీడియా అసత్య ప్రచారం చేస్తూనే ఉంటుందని దానిని తిప్పికొట్టాలని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయసహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు సీఎం జగన్.
బాధిత కుటుంబాల పట్ల మానవతా దృక్ఫథంతో వ్యవహరించాలన్నారు. ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై తొలి ప్రాధాన్యాత ఇవ్వాలని తెలిపారు. పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల విభాగాధిపతులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. బలహీనంగా ఉన్న గోదావరి కట్టలపై నిఘా ఉంచాలని ఆదేశించారు సీఎం. పెట్రోలింగ్ నిరంతరం కొనసాగాలన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ, మరమ్మతు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ చెప్పారు. 48 గంటల్లో పనులన్నీ చక్కదిద్దాలని ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లలో సహాయక శిబిరాలు కొనసాగుతున్నాయని..వాటిని వదిలే ముందు శుభ్రం చేసి ఇవ్వాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హోంమంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డితోపాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also read:President Election LIVE*: రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిది? అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ భయం..
Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook