Horoscope Today July 18 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించిన ధన లాభం!

Today Astrological prediction for July 18 2022. కన్య, కుంభ రాశుల వారికి శుభకాలం నడుస్తోంది. ఈ రెండు వారికి ఊహించిన ధన లాభం ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 18, 2022, 06:23 AM IST
  • July 18 2022 రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?
  • ఆ రెండు రాశుల వారికి ఊహించిన ధన లాభం
Horoscope Today July 18 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించిన ధన లాభం!

Today Horoscope July 18 2022: మేషం ( Aries): ఆర్థికంగా కలిసొచ్చే కాలం. శ్రమతో కూడిన విజయాలు ఉన్నాయి. వివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. విద్యాపరంగా మీరు మంచి పని తీరును కనబరుస్తారు. సహాయం కోసం ఎవరైనా మీపై ఆధారపడవచ్చుదు. ర్గదేవి స్తోత్ర  పారాయణ చేయడం మంచిది.

వృషభం (Taurus): మీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే ప్రయత్నాలు ఉన్నాయి. అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. నూతన వస్తువులను కొంటారు. మానసిక సాంత్వన పొందే అవకాశం ఉంది. కుటుంబంలో చెడు వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. తోటివారి సహాయ సహకారాలున్నాయి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

మిథునం (Gemini): శుభకాలం నడుస్తోంది. వృత్తిపరమైన రంగంలో మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది అద్భుతమైన రోజు. ఒత్తిడికి గురవుతున్న వారు మానసిక ప్రశాంతత పొందడంలో విజయం సాధిస్తారు. దైవబలం కారణంగా అనుకున్న పనులు నెరవేరుతాయి. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. గణపతి నామాన్ని స్మరించడం మంచినిస్తుంది.

కర్కాటకం (Cancer):  నడుస్తోంది. చేపట్టే పనిలో ఆటంకాలు ఉన్నాయి. బంధువుల వ్యవహారాలలో చొరవ తీసుకోవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యారంగంలోని వారికి సానుకూల వాతావరణం ఉంది. ఆదిత్య హృదయ పారాయణం మేలు చేస్తుంది.

సింహం (Leo): చేసే పనిలో ఖర్చులు పెరగవచ్చు. సాహసోపేతమైన నిర్ణయాలు గొప్ప లాభాన్నిస్తాయి. మనోధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళతారు. మీ దయగల స్వభావాన్ని ఎవరైనా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సూర్య స్తుతి శక్తిని ఇస్తుంది.

కన్య (Virgo): మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. భారీగా పెట్టుబడులు పెట్టిన వారికి ఊహించిన దానికంటే అధిక ధన లాభాన్ని పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనులు చేస్తారు. పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేస్తారు. శత్రువుల మీద మీరే విజయం సాధిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.

తుల (Libra): అనుకున్న పనులను పూర్తిచేసి అందరి ప్రశంసలను అందుకుంటారు. సమతుల్య ఆహారం మరియు వ్యాయామం చేయడం మంచిది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరు వస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త. దైవారాదన మానవద్దు.

వృశ్చికం (Scorpio): మిశ్రమ కాలం నడుస్తోంది. ఒక వ్యవహారంలో తోటి వారి సహాయం అందుతుంది. కొందరికి ఆస్తి ఒప్పందం నుంచి మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. ఇంటి వ్యవహారాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో చిన్నపాటి అబిప్రాయబేధాలు వస్తాయి. దుర్గ స్తోత్రం పఠించాలి.

ధనస్సు (Sagittarius): ఆర్థికంగా అనుకూల సమయం. ముఖ్య కార్యాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు  వస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. కొందరు స్నేహితులతో కలిసి విహారయాత్ర లేదా సినిమా కోసం ప్లాన్ చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

మకరం (Capricorn): ఆర్ధిక పరిస్థితి మెరుగయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. చేయని పొరపాటుకు నింద పడాల్సి రావచ్చు. సన్నిహితుల నుంచి మంచి సలహాను పొందుతారు. దత్తాత్రేయ సహస్రనామావళి పఠించడం మంచిది.

కుంభం (Aquarius): మంచి ఫలితాలు ఉన్నాయి. స్పష్టమైన ఆలోచనలతో ఫలితాలను అందుకుంటారు. తలపెట్టిన పనిలో విజయం దక్కుతుంది. ఊహించిన దానికంటే అధిక ధన లాభాన్ని పొందుతారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. నూతన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. చంద్రధ్యానం శుభప్రదం.

మీనం (Pisces): ఆర్థికంగా బాగుంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అభివృద్ధికి సంబందించిన ఓ శుభవార్త వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠించాలి.

Also Read: Ola Sports Car: ఓలా నుంచి త్వరలో ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు

Also Read: Ileana D'Cruz : స్టార్ హీరోయిన్ అన్నతో ప్రేమలో ఇలియానా.. మాములు ట్విస్ట్ కాదుగా ఇది!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News