Ram Gopal Varma: రాం గోపాల్ వర్మకు ఊహించని షాక్.. 'లడకి'కి కష్టాలు

Shock To Ram Gopal Varma's Ladki: వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం లడకీ చిక్కుల్లో పడింది. ఆ సినిమా మీద కోర్టు స్టే విధించింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 17, 2022, 08:05 PM IST
  • రామ్ గోపాల్ వర్మ లడకీ సినిమాకు కష్టాలు
  • స్టే ఇచ్చిన సిటీ సివిల్ కోర్టు
  • నిర్మాత శేఖర్ రాజు వెల్లడి
Ram Gopal Varma: రాం గోపాల్ వర్మకు ఊహించని షాక్.. 'లడకి'కి కష్టాలు

Shock To Ram Gopal Varma's Ladki: వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం లడకీ. ఈ సినిమాను తెలుగులో అమ్మాయి పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు వర్మ. కేవలం తెలుగు సహా మిగతా భారతీయ బాషలలో మాత్రమే కాక చైనీస్ బాషలో కూడా విడుదలైంది. అయితే ఈ సినిమా విషయంలో ఆయనకు షాక్ తగిలింది. తాజాగా "లడకీ" సినిమాపై న్యాయస్థానం స్టే విధించింది.

పూజా భలేకర్ బ్రూస్ లీ అభిమానిగా వర్మ దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ సినిమాను నిలుపుదల చేయాలంటూ నిర్మాత కె.శేఖర్ రాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు "లడకీ" సినిమాను నిలిపివేయాలి అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గతంలో కూడా ఆయన డేంజరస్ సినిమా మీద స్టే తీసుకువచ్చి వార్తల్లోకి ఎక్కారు. ఇక ఈ క్రమంలో శేఖర్ రాజు మాట్లాడుతూ గతంలో "సాఫ్ట్ వేర్ సుధీర్" సినిమాను నిర్మించిన తాను రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఓసినిమాను  నిర్మించాలని భావించానని అన్నారు.

ఈ క్రమంలోనే ఆయనను కలిశానని తనతో సినిమా చేయడానికి ఇప్పుకున్న ఆయన తన దగ్గర సినిమా చేస్తున్నాను అని పలు ధపాలుగా లక్షలాది రూపాయలు తీసుకున్నారని అన్నారు. అయితే అవి తిరిగి ఇవ్వమంటే మాత్రం వర్మ ఎప్పటికప్పుడు దాటవేస్తూ, తప్పించుకుంటూ వస్తున్నారని శేఖర్ రాజు పేర్కొన్నారు. తన దగ్గర తీసుకున్న డబ్బు వెనక్కు తిరిగి ఇవ్వకపోగా, సరిగ్గా సమాధానం కూడా చెప్పడం లేదని శేఖర్ రాజు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తన దగ్గర ఉన్న ఆధారాలతో కోర్టును ఆశ్రయించానని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలోనే సిటీ సివిల్ కోర్టు 'లడకీ" సినిమాను అన్ని భాషలలో ప్రదర్శనను నిలిపి వేయాలని ఉత్తర్వులు జారీ చేసిందని వెల్లడించారు. అలాగే అన్నిరకాల డిజిటల్, ప్లాట్ ఫామ్స్ లో సినిమాను అమ్మడానికి కానీ వేరే వారికి సినిమా హక్కులు ట్రాన్స్ఫర్ చేయడానికి వీలులేకుండా  తాత్కాలిక నిషేధం విధిస్తూ కోర్టు ఆర్డర్స్ ఇచ్చిందని ఆయన మీడియాకు సమాచారం ఇచ్చారు. అయితే కోర్టు 14 వ తేదీన ఈ ఆదేశాలు ఇచ్చినట్టు చెబుతున్నా సినిమా కొన్ని చోట్ల విడుదల కూడా అయింది. మరి కోర్టు ఆర్డర్స్ అతిక్రమించి విడుదల చేశారా? అనేది తెలియాల్సి ఉంది. 
 Also Read: Jabardasth: ఒక్క డైలాగ్ తో బులెట్ భాస్కర్ పరువు తీసిన ఖుష్బూ

Also Read: Bunny Vasu: బన్నీ వాసుకు త్రుటిలో తప్పిన పెనుప్రమాదం.. లేదంటే వరదల్లో?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News