PV Sindhu: సింగపూర్ ఓపెన్ విజేతగా తెలుగు తేజం, ఒలింపిక్స్ పతకాల విజేత పీవీ సింధు నిలిచింది. ఫైనల్లో చైనా క్రీడాకారిణి వాంగ్ జి యినిపై ఘన విజయం సాధించింది. దీంతో కెరీర్లోనే తొలి సూపర్ 500 టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ఆది నుంచి పీవీ సింధు దూకుడుగా ఆడింది. మొత్తంగా 21-9, 11-21, 21-15 తేడాతో వాంగ్‌పై విజయఢంకా మోగించింది. ఈఏడాది ఏడో ర్యాంకర్ పీవీ సింధు అద్భుత ఫామ్‌లో ఉంది. ఐతే ఫైనల్ మ్యాచ్‌లో 11వ ర్యాంకర్ వాంగ్‌తో తలపడింది.
తొలి గేమ్‌లో సింధు రఫాడించింది. 21-9 తేడాతో సొంతం చేసుకుంది. ఈక్రమంలో రెండో గేమ్‌లో వాంగ్ సూపర్ ఫామ్‌లోకి వచ్చింది. సింధును 11-21తో వెనక్కు నెట్టింది. కీలకమైన మూడో గేమ్‌లో ఇద్దరు మధ్య పోటా పోటీ నెలకొంది. నువ్వానేనా అన్నట్లు సాగిన ఈసెట్‌లో సింధు జయకేతనం ఎగురవేసింది. దీంతో తొలిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను పీవీ సింధు దక్కించుకుంది. ఈఏడాదిలోనే సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 టైటిళ్లను సొంతం చేసుకుంది.
A stunning performance by @Pvsindhu1 🇮🇳to clinch her first ever #SingaporeOpen title with a 21-9, 11-21, 21-15 defeat of #WangZhi 🇨🇳
With her third title of 2022, @PvSindhu1 is looking in great form! pic.twitter.com/kpnY6CBT9r
— Anurag Thakur (@ianuragthakur) July 17, 2022
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.