Shani Upayalu: శివుడికిష్టమైన ఈ శ్రావణ మాసంలో...ఆ ఒక్క పనీ చేస్తే చాలు..శని ప్రకోపం ఉండదు

Shani Upayalu: శని వక్రమార్గంతో కొన్ని రాశులపై దుష్ప్రభావం, శనిదోషం ప్రారంభమైపోతుంది.  మరికొన్ని రాశులు మాత్రం శని ప్రకోపం నుంచి తప్పించుకుంటాయి. శని ప్రకోపం నుంచి రక్షించుకునేందుకు శ్రావణమాసం అద్భుత అవకాశమంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 16, 2022, 08:19 PM IST
Shani Upayalu: శివుడికిష్టమైన ఈ శ్రావణ మాసంలో...ఆ ఒక్క పనీ చేస్తే చాలు..శని ప్రకోపం ఉండదు

Shani Upayalu: శని వక్రమార్గంతో కొన్ని రాశులపై దుష్ప్రభావం, శనిదోషం ప్రారంభమైపోతుంది.  మరికొన్ని రాశులు మాత్రం శని ప్రకోపం నుంచి తప్పించుకుంటాయి. శని ప్రకోపం నుంచి రక్షించుకునేందుకు శ్రావణమాసం అద్భుత అవకాశమంటున్నారు జ్యోతిష్య పండితులు. ఆ వివరాలు మీ కోసం..

జ్యోతిష్యశాస్త్రంలో రాశులు, గ్రహాల చలనం, వక్రమార్గాలు, ఫలితాలు, ప్రయోజనాలు, దుష్ప్రయోజనాల గురించి వివరంగా ఉంది. జ్యోతిష్యం ప్రకారం శని వక్రమార్గం పడుతూనే..మకర, ధనస్సు, కుంభ రాశులపై శనిదోషం, దుష్పరిణామాలు ప్రారంభమౌతాయి. శనిదోష నుంచి కాపాడుకునేందుకు, శని దుష్పరిణామాల్నించి రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ వివిధ మార్గాలు అనుసరిస్తుంటారు. లేకపోతే శని కారణంగా జీవితంలో పడరాని కష్టాలు పడాల్సి వస్తుంది. మీరు కూడా శని దోషం, శని ప్రభావం నుంచి కాపాడుకునేందుకు శ్రావణమాసం చాలా బాగా ఉపయోగపడుతుంది. 

శ్రావణ మాసం అనేది శివుడికి అంకితమైన, ఇష్టమైన నెల. ఈ నెలలో శివుడిని పూజిస్తే అత్యధిక ప్రయోజనముంటుంది. పౌరాణిక గాధల ప్రకారం శని..శివుడికి శిష్యుడు. ఈ క్రమంలో శివభక్తులపై శని వక్రదృష్టి సహజంగా ఉండదు. అందుకే శనిదోషమున్నా సరే..కాపాడుకోవచ్చు. శ్రావణ మాసంలో శివ చాలీసా పఠించడం వల్ల శివుడు ప్రసన్నుడౌతాడని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా శనిదోషం నుంచి రక్షించుకోవచ్చు.

శివ చాలీసా క్రమం తప్పకుండా రోజూ పఠించడం వల్ల శనిదోషం, శని దుష్పరిణామాల్నించి రక్షించుకోవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మీరు కూడా శనిదోషం ప్రభావితులై ఉంటే..ఈ శ్రావణ మాసంలో శివ చాలీసా పఠించడం ద్వారా శని ప్రకోపం నుంచి కాపాడుకోండని అంటున్నారు. 

Also read: Dreams Meanings: మీ కలలో అవి కన్పిస్తున్నాయా..అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్టే

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News