Who is Jagdeep Dhankhar: ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధంకర్‌.. ఇంతకీ ఎవరీ జగదీప్ ధంకర్ ?

Who is Jagdeep Dhankhar: ఎన్డిఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధంకర్ పేరును ఖరారు చేస్తూ బీజేపి ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జగదీప్ ధంకర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. 

Written by - Pavan | Last Updated : Jul 16, 2022, 09:21 PM IST
  • ఎన్డిఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధంకర్
  • ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కొనసాగుతున్న జగదీప్ ధంకర్
  • జగదీప్ ధంకర్ పేరును ప్రకటిస్తూ జేపీ నడ్డా ప్రశంసలు
Who is Jagdeep Dhankhar: ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధంకర్‌.. ఇంతకీ ఎవరీ జగదీప్ ధంకర్ ?

Who is Jagdeep Dhankhar: ఎన్డిఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధంకర్ పేరును ఖరారు చేస్తూ బీజేపి ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. జగదీప్ ధంకర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరితో పాటు ఇతర కీలక నేతలు సభ్యులుగా ఉన్న బీజేపి పార్లమెంటరీ ప్యానెల్ జగదీప్ పేరును ఖరారు చేసింది. ఢిల్లీలో బీజేపి పార్లమెంటరీ బోర్డు సమావేశాలు జరిగిన అనంతరం పార్టీ చీఫ్ జేపీ నడ్డా ఈ అంశంపై ప్రస్తావిస్తూ జగదీప్ ధంకర్ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా జగదీప్ ధంకర్ గురించి జేపీ నడ్డా మాట్లాడుతూ.. స్వతహాగా రైతు పుత్రుడైన జగదీప్.. ప్రజల గవర్నర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారని కితాబిచ్చారు. 

Jagdeep Dhankhar Political career - జగదీప్ ధంకర్ రాజకీయ ప్రస్థానం మొదలైందిలా..
జగదీప్ ధంకర్ 1989 లోక్ సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని జున్‌జున్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి గెలవడం ద్వారా పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అలా తొలిసారిగా ఎన్నికలు ఎదుర్కొన్న జగదీప్ ధంకర్ గత మూడు దశాబ్ధాలకుపైగా కాలం నుంచి ప్రజా జీవితంలోనే కొనసాగుతున్నారు. 

పార్లమెంట్‌లో అడుగుపెట్టిన మరుసటి ఏడాదే.. అంటే 1990 లోనే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ద్వారా అనతి కాలంలోనే రాజకీయాల్లో మరో మెట్టు పైకెక్కారు. 

1993లో జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అజ్మేర్ జిల్లా కిషన్‌ఘడ్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి రాజస్థాన్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 

2019 లో జగదీప్ ధంకర్ పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. వెస్ట్ బెంగాల్లో ప్రజా సమస్యలపై అక్కడి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాధినేత, ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జితో పోరాడుతూ తరచుగా వార్తల్లో నిలిచారు. పశ్చిమ బెంగాల్లో విశ్వ విద్యాలయాల నిర్వహణ నుంచి మొదలుకుని బీజేపి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ దాడులు, హింస వరకు అనేక సందర్భాల్లో జగదీప్ ధంకర్ పేరు ప్రముఖంగా వినిపించింది.

ద్రౌపది ముర్ము ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగుతుండగా, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు జూలై 19వ తేదీ తుది గడువు కాగా.. ఆగస్టు 6న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Also Read : EPFO New Rules : ఈపీఎఫ్‌ ఖాతాదారులారా గమనించారా.. ఈపీఎఫ్ఓ నిబంధనల్లో కీలక మార్పులు ఇవే

Also Read : PM Modi on Free Poll Promises: దేశాభివృద్ధికి ఉచిత హామీలు ప్రమాదకరం..యూపీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Also Read : Telangana, Andhra Pradesh Rain Updates: తెలుగు రాష్ట్రాలకు మరోసారి రెయిన్ అలర్ట్..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News