Kiraak RP Jabardasth: కిరాక్ ఆర్పీ సినిమా అందుకే ఆగింది.. అసలు ఫ్రాడ్ బయటపెట్టిన ఏడుకొండలు

Jabardasth Edukondalu Reveals Kiraak Rp Frauds: తాజాగా ఒకప్పటి జబర్దస్త్ మేనేజర్ ఏడుకొండలు కూడా తెరమీదకు వచ్చారు. ఆయన కూడా తెరమీదకు రావడమే కాక ఆర్పీ సినిమాకి మేనేజర్ గా వ్యవహరించానని, ఆర్పీ చేసిన ఫ్రాడ్స్ అంటూ  కొన్ని విషయాలు బయట పెట్టారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 15, 2022, 12:58 PM IST
  • చర్చనీయాంశంగా జబర్దస్త్ వివాదం
  • ఆర్పీ వ్యాఖ్యలతో కలకలం
  • రంగంలోకి ఏడుకొండలు
Kiraak RP Jabardasth: కిరాక్ ఆర్పీ సినిమా అందుకే ఆగింది.. అసలు ఫ్రాడ్ బయటపెట్టిన ఏడుకొండలు

Jabardasth Edukondalu Reveals Kiraak Rp Frauds: గత కొద్దిరోజులుగా జబర్దస్త్ ప్రోగ్రాం వార్తల్లో నిలుస్తోంది. గతంలో ఆ ప్రోగ్రాంలో ఒక కంటెస్టెంట్ గా వ్యవహరించిన కిరాక్ ఆర్పీ షో నుంచి బయటికి వచ్చి చాలా కాలమే అయింది. కానీ అనూహ్యంగా కాబోయే భార్యతో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జబర్దస్త్ పైన, ఆ ప్రోగ్రాం నిర్మాణ సంస్థ మల్లెమాల పైన, నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి పైన అనేక సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయం మీద ఇప్పటికే హైపర్ ఆది, రాంప్రసాద్,షేకింగ్ శేషు వంటి వారు ఆర్పీకి కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఆర్పీ చెప్పింది కరెక్ట్ కాదని వాళ్లు కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఒకప్పటి జబర్దస్త్ మేనేజర్ ఏడుకొండలు కూడా తెరమీదకు వచ్చారు. ఆయన కూడా తెరమీదకు రావడమే కాక ఆర్పీ చేసిన కామెంట్స్ ని ఖండించారు. శ్యాం ప్రసాద్ రెడ్డి లాంటి వ్యక్తిత్వాన్ని ఎక్కడా చూడలేమని ఆయన చాలా మంచివారిని, ఆయన మీద కామెంట్ చేసే స్థాయి ఆర్పీది కాదని చెప్పుకొచ్చారు.

అంతేకాక తాను ఆర్పీ చేయాల్సిన సినిమాకి మేనేజర్ గా వ్యవహరించానని అన్నారు. ఆ సమయంలో అతను చేసిన ఫ్రాడ్స్ అంటూ కూడా కొన్ని విషయాలు బయట పెట్టారు. ఆర్పీ సినిమా చేస్తున్న సమయంలోనే తాను వేరే సినిమా కోసం పనిచేస్తున్నానని ఒక డబ్బింగ్ పని మీద ఆర్పీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి వెళ్లడంతో తనను చూసి పలకరించి సినిమా కోసం పని చేయమని అడిగాడని అన్నారు. జీతం 50,000 ఇస్తే పనిచేస్తానన్నానని ఒక 50,000 అడ్వాన్స్ గా ఇచ్చిన తర్వాత సినిమా కోసం పని చేయడం మొదలు పెట్టానని అన్నారు.

సుమారు తనకు ఎనిమిది నెలల పాటు నెలకు 50,000 చొప్పున జీతం ఇచ్చారని, అయితే నిర్మాత బాగుండాలి అనే ఉద్దేశంతో ఆర్పీ చేసిన కొన్ని ఫ్రాడ్స్ బయటపెట్టానని అన్నారు. 3 లక్షల రూపాయలు ఒక సినిమాటోగ్రాఫర్ కి అడ్వాన్స్ ఇచ్చాను అని ఆర్పీ చెప్పాడని కానీ అది నిజం కాదు అనే విషయాన్ని తాను నిర్మాత అరుణాచలం దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన ఆర్పీని మందలించాడని అన్నారు. దీంతో ఆ మూడు లక్షలు తెప్పించి ఇచ్చాడు కానీ మళ్ళీ వెంటనే ఎదో లాప్టాప్ కావాలని ఆ మూడు లక్షలు కూడా ఖర్చు పెట్టించాడని అన్నారు.

అలాంటి ఆర్పీ ఇప్పుడు శ్యాం ప్రసాద్ రెడ్డి గారి మీద కామెంట్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని ఏడుకొండలు చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను కొన్ని రాజకీయాల వల్ల జబర్దస్త్ వదిలి వెళ్ళిపోయాను కానీ ఇప్పుడు శ్యాం ప్రసాద్ రెడ్డి గారి మీద వీళ్ళందరూ చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే తాను మళ్ళీ వెనక్కి వచ్చి ఇలా కామెంట్ చేస్తున్న వాళ్ళ అందరినీ మళ్లీ వెనక్కి రప్పించి మరి స్కిట్స్ చేయిస్తానని అన్నారు. జబర్దస్త్ వదిలిన వాళ్ళ అందరితో తాను పనిచేయిస్తానని ఆయన అంటున్నారు. ఈ 'జబర్దస్త్' వ్యవహారం ఎంత దూరం వెళుతుంది అనేది చూడాలి మరి.

Also Read: Gargi Movie Review: లేడీ పవర్ స్టార్ 'సాయి పల్లవి' నటించిన 'గార్గి' సినిమా ఎలా ఉందంటే?

Also Read:  Pratap Pothen: రాధిక మాజీ భర్త ప్రతాప్ పోతెన్ కన్నుమూత

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News