Cancer Treatment: ప్రాణాంతక కేన్సర్ మందు కోసం నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బ్రెస్ట్ కేన్సర్ చికిత్స ఇకపై సులభతరం కానుంది. రెండు కొత్త మందులకు ఇంగ్లండ్ ఎన్‌హెచ్‌ఎస్ అనుమతిచ్చింది.
బ్రెస్ట్ కేన్సర్ రోగులకు శుభవార్త. ఇక నుంచి బ్రెస్ట్ కేన్సర్ చికిత్స మరింత సులభం కానుంది. ఇంగ్లండ్‌కు చెందిన నేషనల్ హెల్త్ పాలసీ రెండు ఔషధాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెకండరీ బ్రెస్ కేన్సర్ బారినపడిన మహిళలకు ఈ రెండు మందులతో ఉపశమనం లభిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఎల్పెలిసిబ్ ఔషధంతో ఏడాది వ్యవధిలో 3 వేలమంది మహిళలకు ప్రయోజనం కలిగితే..ట్రోడెలవీ ద్వారా 650 మహిళలు లబ్ది పొందారు. అందుకే ఎన్‌హెచ్‌ఎస్ ఈ రెండు ఔషధాలకు పచ్చ జెండా ఊపింది.
ప్రముఖ ఫార్మా కంపెనీ నోవార్టిస్ ఉత్పత్తి చేస్తున్న ఎల్పెలిసిబ్ అనేది వేగంగా ఎదిగే ట్యూమర్‌కు కారణమైన జీన్‌ను టార్గెట్ చేస్తుంది. సెకండరీ బ్రెస్ట్ కేన్సర్ రోగుల లైఫ్‌టైమ్ పెంచేందుకు ఈ మందు దోహదపడుతోందని ఎన్‌హెచ్ఎస్ కమీషనింగ్ డైరెక్టర్ జాన్ స్టీవర్ట్ తెలిపారు. ఇక మరో ఔషధం ట్రోడెల్వీ గిలియడ్ సైన్సెస్ ఉత్పత్తి చేస్తోంది. దీనినే సైకిటుజుమేబ్ గోవిటేకన్ అని కూడా పిలుస్తారు. ఆపరేషన్ ద్వారా తొలగించలేని వాటి చికిత్సకు ఈ ఔషధాన్ని వినియోగించేందుకు ఆమోదించారు. ఈ ఔషధం ట్రిపుల్ నెగెటివ్ చికిత్సతో సెకండరీ బ్రెస్ట్ కేన్సర్ పీడిత మహిళలకు లాభం కలుగుతుంది. ప్రస్తుతం ఇలాంటి మహిళలకు కీమోథెరపీ ఇస్తున్నారు. ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ కేన్సర్ 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న మహిళల్లో ఎక్కువగా కన్పిస్తుంది. ప్రస్తుతం 15-20 శాతం మహిళలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్సెలెన్స్ ప్రకారం..కొత్త చికిత్సతో ట్యూమర్ రోగుల్లోని ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకుంటారు. ఇదే అధికశాతం మరణాలకు కారణమౌతుంటుంది. సుదీర్ఘ సమయం ఈ వ్యాధి పెరగకుండా ఈ కొత్త ఔషధం సమర్ధవంతంగా పనిచేసినట్టు క్లినికల్ ట్రయల్స్‌లో గుర్తించారు. సాంప్రదాయ కీమోథెరపీతో పోలిస్తే ఈ ఔషధంతో దాదాపు జీవిత సమయాన్ని 5 నెలలు పెంచవచ్చు.
ట్రోడెల్వీ ఔషధానికి ఇంగ్లండ్‌లోని ఎన్‌హెచ్‌ఎస్ అనుమతిచ్చింది. ట్రిపుల్ నెగెటివ్ సెకండరీ బ్రెస్ట్ కేన్సర్‌తో పీడిత మహిళలకు ఈ ఔషధం చాలా అద్భుతంగా పనిచేయనుందని తెలుస్తోంది.
Also read: Teeth Care Tips: ఆ 4 చెడు అలవాట్లు మానితే..అందమైన, ఆరోగ్యమైన పళ్లు మీ సొంతం
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook