Nonstick Pans: ఆధునిక జీవనశైలిలో మారుతున్న ఆహారపు అలవాట్లతో పాటు కుకింగ్ శైలి కూడా మారుతోంది. ప్రతి వంటకూ నాన్‌స్టిక్ అలవాటైపోయింది. కానీ నాన్‌స్టిక్ ఎంత ప్రమాదకరమనేది మర్చిపోతున్నారు.
ఆధునిక జీవనశైలి కిచెన్‌లో ఎన్నెన్నో మార్పులు తెస్తోంది. ప్రస్తుతం ప్రతి వంటకు నాన్‌స్టిక్ ఓ అలవాటుగా మారిపోయింది. నాన్‌స్టిక్ అనేది ప్రతి కిచెన్‌లో సర్వ సాధారణంగా కన్పించే వస్తువుగా మారిపోయింది. అయితే నాన్‌స్టిక్‌లో అన్ని ఆహార పదార్ధాలు వండకూడదనే విషయం చాలా తక్కువమందికి తెలుసు. నాన్‌స్టిక్‌లో ఎలాంటి ఆహార పదార్ధాలు వండాలి, ఎలాంటివి వండకూడదనే వివరాలు తప్పకుండా తెలుసుకోవాలి.
నాన్‌స్టిక్ ప్యాన్‌లో హై టెంపరేచర్‌లో ఏ పదార్ధాన్ని వండకూడదు. ఎందుకంటే ప్యాన్ కోటింగ్ కరిగి..ఆహారంలో కల్సిపోయి విషతుల్యమయ్యే ప్రమాదముంది. ఒకవేళ మాంసం లేదా బర్గర్ వంటి ఏదైనా పదార్ధాల్ని నాన్‌స్టిక్‌లో వండితే అది ఆరోగ్యానికి హాని కల్గిస్తుంది.
సాస్, సూప్, మాంసం, పాయసం వంటి ఆహార పదార్ధాల్ని నాన్‌స్టిక్‌లో వండకపోవడమే మంచిది. ఇవి పాన్ కోటింగ్‌పై ప్రభావం చూపిస్తాయి. ఆహారంలో పాన్ కోటింగ్ కలిస్తే ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. ఎక్కువ సేపు వండే వెజిటబుల్ ఫ్రై పదార్ధాల్ని కూడా నాన్‌స్టిక్‌లో వండకూడదు. ఎక్కువ టెంపరేచర్‌తో వండే పదార్ధాల్ని నాన్‌స్టిక్‌లో వండకూడదు. నాన్‌స్టిక్ కోటింగ్ కరగకుండా జాగ్రత్త పడాలి.
మాంసం వంటి వస్తువుల్ని వండేందుకు పాన్‌ను ముందుగా హీట్ చేస్తుంటాం. లేకపోతే ఆరోగ్యం చెడిపోతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఎక్కువ హీట్‌లో వండాల్సిన ఏ ఆహార పదార్ధాన్నీ నాన్‌స్టిక్‌లో వండకూడదు. వీలైనంతవరకూ తక్కువ హీట్ అవసరమయ్యే ఆహార పదార్ధాల్నే వండాలి.
Also read: Health Tips: మహిళలతో పోలిస్తే..పురుషులకే ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ అవసరం, ఎందుకు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook