India vs Zimbabwe: ఈఏడాది ఆగస్టులో జింబాబ్వే పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయ్యింది. టూర్‌లో మొత్తం మూడు వన్డేలను భారత్ ఆడనుంది. ఆగస్టు 18 నుంచి 22 వరకు సిరీస్ కొనసాగుతుంది. ఈ విషయాన్ని జింబాబ్వే టెక్నికల్ డైరెక్టర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ తెలిపారు. టీమిండియాతో జింబాబ్వే ఆడటం గొప్ప అవకాశమన్నారు.
ఈసిరీస్ వల్ల జింబాబ్వే క్రికెట్ ఎంతో ఉపయోగం జరగనుందని చెప్పారు. టీమిండియా రాక కోసం తమంతా ఎదురు చూస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం భారత జట్టు ..ఇంగ్లండ్‌లో ఉంది. ఇంగ్లీష్ జట్టుతో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈటూర్ తర్వాత భారత జట్టు విండీస్‌కు వెళ్లనుంది.
వెస్టిండీస్‌లో మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లను ఆడనుంది. ఆ తర్వాత జింబాబ్వే టూర్‌కు వెళ్తుంది. మరోవైపు ఆగస్టు 27 నుంచి శ్రీలంక వేదికగా ఆసియా కప్ జరగనుంది. ఈక్రమంలో భారత జూనియర్ జట్టు ..జింబాబ్వేకు వెళ్లే అవకాశం ఉంది. 2016లో టీమిండియా జట్టు..ఆ దేశంలో పర్యటించింది.
Also read: Political Murders: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య..కాల్చి చంపబడిన రాజకీయ నాయకులు వీరే..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
India vs Zimbabwe: జింబాబ్వే వెళ్లనున్న భారత క్రికెట్ జట్టు..షెడ్యూల్ ఇదే..!
బిజీ బిజీగా టీమిండియా
త్వరలో జింబాబ్వేకు భారత్
తేదీలు ఖరారు