India Corona updates: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,815 మంది వైరస్ బారిన పడ్డారు. వైరస్ సోకి మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి 15,899 మంది కోలుకున్నారు. దేశంలో మెుత్తం ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 4,29,37,876గా ఉంది. దీంతో రికవరీ అయనవారి సంఖ్య 98.52 శాతంగా ఉంది. మెుత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు సంఖ్య 0.27 శాతంగా నమోదైంది. డైలీ పాజిటివిటీ రేటు 4.96 శాతంగా రికార్డు అయింది.
దేశంలో ప్రస్తుతం 1,22,335 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు నమోదైన మెుత్తం మరణాల సంఖ్య 5,25,343గా నమోదైంది. నిన్న 3,79,470 మందికి కరోనా పరీక్షలు చేశారు. భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం స్థిరంగా కొనసాగుతుంది. గురువారం 17,62,441 మందికి టీకాలు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,98,51,77,962గా నమోదైంది.
వరల్డ్ వైడ్ గా కరోనా కల్లోలం కొనసాగుతోంది. తాజాగా 9,25,494 మందికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైరస్ తో మరో 1,725 మంది ప్రాణాలు విడిచారు. ఫ్యాన్స్ లో 1,61,265 మందికి వైరస్ సోకగా... మరో 89 మంది మరణించారు. అగ్రరాజ్యం అమెరికాలో నిన్న ఒక్కరోజే 91,472 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారితో 320 మంది ప్రాణాలు కోల్పోయారు.
#COVID19 | India reports 18,815 fresh cases, 15,899 recoveries, and 38 deaths in the last 24 hours.
Active cases 1,22,335
Daily positivity rate 4.96% pic.twitter.com/1kAaTtgBp6— ANI (@ANI) July 8, 2022
Also Read: Cooking Oil: దేశంలో దిగొస్తున్న వంట నూనెల ధరలు..తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook