LPG Price Hike: దేశంలో చమరు ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి గృహ వినియోగదారులకు షాకిచ్చాయి చమురు సంస్థలు. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పై ఏకంగా 50 రూపాయలు పెంచాయి.పెరిగిన ధరలు ఈ రోజు నుంచే అమలులోనికి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిన్నటి వరకు ఎస్పీజీ సిలిండర్ ధర 1003 రూపాయలు ఉండగా.. తాజా పెంపుతో రూ.1053కు చేరుకుంది. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.1055 నుంచి 1105 రూపాయలకు పెరిగింది.
గృహ వినియోగదారులకు షాకిస్తూ డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర పెంపుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సీరియస్ గా స్పందించారు. అచ్చెదన్ ఆగయా.. చప్పట్లు కొట్టండి అంటూ ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పటికే 1050 రూపాయలు ఉండగా తాజా పెంపుతో 11 వందల రూపాయలు దాటిందని తన ట్వీట్ లో కేటీఆర్ పేర్కొన్నారు. గృహ వినియోగదారులకు మోడీ సర్కార్ ఇచ్చిన గిఫ్ట్ అంటూ కేటీఆర్ సెటైర్ వేశారు.
#AchheDin Aa Gaye 👏 Badhai Ho #LPG over ₹1050 👇 An increase again of ₹50
Modi Ji’s Gift to all Indian Households👍 https://t.co/BknwJ2zNfi
— KTR (@KTRTRS) July 6, 2022
గుజరాత్ రాష్ట్రంలో 35 శాతం ఇళ్లు అక్రమంగా నిర్మించినవే అంటూ జాతీయ పత్రికలో వచ్చిన వార్తను పోస్ట్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. గుజరాత్ లో అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లు వస్తాయా అంటూ వ్యగ్యంగా ట్వీట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లో కొన్ని రోజులుగా అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. అయితే అక్రమ నిర్మాణాల పేరుతో ఓ వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. యూపీ ఘటనల నేపథ్యంలోనే గుజరాత్ నిర్మాణాలపై కేటీఆర్ పోస్ట్ చేసినట్లు కనిపిస్తోంది.
Where is the Bull Dozing now?#Bulldozer pic.twitter.com/E9H4PYJVWK
— KTR (@KTRTRS) July 6, 2022
Read also: AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్..?
Read also: AP Schools: నాడు- నేడు అంటే ఇదేనా.. ఏపీలో 8 వేల ప్రభుత్వ స్కూళ్లు మాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook