TS TET 2022 Results: తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటల 30 నిమిషాలకు టెట్ పరీక్షా ఫలితాలు విడుదల చేశారు. నిజానికి తెలంగాణ టెట్ ఫలితాలు జూన్ 27న రిలీజ్ కావాల్సి ఉంది. టెట్ నోటిఫికేషన్ లో జూన్ 27న ఫలితాలు వెల్లడిస్తామని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. కాని షెడ్యూల్ ప్రకారం ఫలితాలు విడుదల కాలేదు. దీంతో టెట్ అభ్యర్థులు ఆందోళన చెందారు. ఎట్టకేలకు ఇవాళ ఫలితాలు విడుదలయ్యాయి.
విద్యార్థులు ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి :
మొదట www.tstet.cgg.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
హోమ్ పేజీలో 'TS TET 2022 Result' ఆప్షన్‌పై క్లిక్ చేయండి
ఇప్పుడు మీ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ చేసి సబ్‌మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి
అంతే.. స్క్రీన్‌పై మీ స్కోర్ కార్డ్ డిస్‌ప్లే అవుతుంది
ఫలితాల కాపీని ప్రింటవుట్ తీసి ఉంచుకోండి
త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్..!
రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12న టెట్ పేపర్ 1, పేపర్ 2 పరీక్షలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పేపర్-1కు 3,18,506 మంది, పేపర్-2కు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్ ఫైనల్ కీని బుధవారం విడుదల చేశారు అధికారులు. ప్రాధమిక కీకి సంబంధించి అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది కీ ఇచ్చారు విద్యాశాఖ అధికారులు. టెట్ ఫలితాలు రానుండటంతో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలను గుర్తించారు. అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఐదేళ్లుగా టీచర్ రిక్రూట్ మెంట్ జరగలేదు. దీంతో లక్షలాది మంది ఉపాధ్యాయ నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.
Read also: HMDA plots e-auction: ఈ వేలం ప్రక్రియకు భారీ స్పందన..ఇక్కడ గజం స్థలం విలువ రూ.62,500
Read also: Mask Must in Telangana: తెలంగాణలో ఇక మాస్క్ తప్పనిసరి..ధరించకపోతే భారీ జరిమానా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook