Naga Chaitanya First Love: సమంత కంటే ముందే లవ్ స్టోరీ.. అలా బయట పెట్టిన నాగచైతన్య

Naga Chaitanya First Love Revealed: నాగ చైతన్య మొదటి ప్రేయసి సమంతా అని అందరూ అనుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తనకు ముందే లవ్ స్టోరీ ఉందంటూ బయటపెట్టారు నాగ చైతన్య. థాంక్యూ సినిమా  నుంచి ఫేర్వెల్ అంటూ సాగుతున్న ఒక పాటను సోమవారం నాడు మల్లారెడ్డి కాలేజీలో విడుదల చేసింది సినిమా యూనిట్. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 28, 2022, 10:18 AM IST
  • థాంక్యూ మూవీ ప్రమోషన్స్ లో నాగ చైతన్య
  • స్టూడెంట్స్ తో ఆసక్తికర విషయాలు పంచుకున్న చైతూ
  • ఆ సమయంలో లవ్ స్టోరీ రివీల్
Naga Chaitanya First Love: సమంత కంటే ముందే లవ్ స్టోరీ.. అలా బయట పెట్టిన నాగచైతన్య

Naga Chaitanya Revealed his  First Love: అక్కినేని కుటుంబం నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నాగచైతన్య తరువాతి కాలంలో తన రెండో సినిమాలో హీరోయిన్ గా నటించిన సమంతను ప్రేమించాడు. ఈ ఇద్దరు కూడా తమ పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ నాలుగేళ్ల తర్వాత మేము విడిపోతున్నాం అని అధికారికంగా ప్రకటించి కుటుంబాలకే కాక ఇటు అభిమానులతో సహా తెలుగు ప్రేక్షకులు అందరికీ షాక్ ఇచ్చారు. అయితే నాగచైతన్య మొదటి ప్రేయసి సమంతా అని అందరూ అనుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తనకు ముందే లవ్ స్టోరీ ఉందంటూ బయటపెట్టారు నాగ చైతన్య.

అసలు విషయం ఏమిటంటే తాజాగా నాగచైతన్య థాంక్యూ అనే సినిమా చేశారు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను జూలై నెలలో విడుదల చేయాలని భావిస్తున్న తరుణంలో ఇప్పటికే ప్రమోషన్స్ కూడా ప్రారంభించింది సినిమా యూనిట్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే కొన్ని పాటలు, పోస్టర్లు విడుదల చేశారు. వాటికి మంచి స్పందన కూడా లభించింది.   తాజాగా ఈ సినిమా నుంచి ఫేర్వెల్ అంటూ సాగుతున్న ఒక పాటను సోమవారం నాడు మల్లారెడ్డి కాలేజీలో విడుదల చేసింది సినిమా యూనిట్. 

ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగచైతన్య అక్కడ ఉన్న విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారితో తన కాలేజీ రోజుల్లో జరిగిన అనేక విషయాలను పంచుకుంటూ తనకు అప్పట్లో ప్రేమకథ ఉందనే విషయాన్ని వెల్లడించారు. కాలేజీ రోజులు చాలా గొప్పగా ఉంటాయని, ఇప్పుడు బోర్గా అనిపించినా తర్వాత కాలేజీ రోజుల విలువ ఏమిటో తెలుస్తుందని చెప్పుకొచ్చారు. తాను కూడా కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఈ కాలేజీ అయిపోతుంది? నేనెప్పుడూ కెరీర్ స్టార్ట్ చేయాలి? నా ప్రేమ విషయాన్ని ఎప్పుడూ మా ఇంట్లో చెప్పాలి అని ఎదురు చూశాను అంటూ నాగచైతన్య పేర్కొన్నారు. 

దీంతో సమంత నాగచైతన్య మొదటి లవ్ కాదని ఆయనకు కాలేజీ రోజుల్లోనే ప్రేమ కథ ఉందని అందుకే ఈ విధంగా మాట్లాడి ఉండవచ్చని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే నిజానికి ఈ సినీరంగంలో ప్రవేశించాక కూడా సమంతను ప్రేమించక ముందు నాగచైతన్య శృతి హాసన్ తో కొన్నాళ్ళు డేటింగ్ లో ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు కానీ ఇప్పుడు విడాకుల తర్వాత ఆయన శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద కూడా నాగచైతన్య సైలెన్స్ పాటిస్తూ రావడంతో అది నిజమేనేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Also Read: Mythri Movie Makers: అదిరిపోయే ప్లాన్ వేసిన మైత్రీ మూవీ మేకర్స్.. ఆ మలయాళ హీరోతో క్రేజీ మూవీ?

Also Read: Alia Bhatt Pregnancy: త‌ల్లి కాబోతున్న అలియా భ‌ట్‌.. వైర‌ల్ అవుతున్న ఫోటో!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News