India vs Ireland T20 Head To Head Records: హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత యువ జట్టు ఐర్లాండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆదివారం (జూన్ 26) ఆరంభం కానుంది. డబ్లిన్ వేదికగా జరుగనున్న మొదటి మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 9 గంటలకు ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారత్, ఐర్లాండ్ జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత రికార్డులను ఓసారి పరిశీలిద్దాం.
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్, ఐర్లాండ్ జట్లు ఇప్పటివరకు మూడు మ్యాచుల్లో తలపడ్డాయి. ఈ మూడింటిలోనూ టీమిండియానే విజయం సాధించింది. తొలిసారి టీ20 ప్రపంచకప్ 2009లో ఇరు జట్లు తలపడగా.. భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 18 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 8 వికెట్లకు 112 పరుగులు చేయగా.. ఛేదనలో భారత్ మరో 15 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది.
2018లో భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య రెండు మ్యాచుల టీ20 సిరీస్ జరగ్గా.. ఆ రెండింటిలో టీమిండియానే గెలిచింది. తొలి టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 9 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేసి ఓడింది. రెండో టీ20ల తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగా.. ఛేదనలో ఐర్లాండ్ 70 పరుగులకే ఆలౌట్ అయింది.
భారత్, ఐర్లాండ్ ప్లేయర్స్ రికార్డ్స్:
అత్యధిక పరుగులు: రోహిత్ శర్మ 149 (74.50 సగటు, 137 స్ట్రైక్ రేట్)
అత్యధిక వ్యక్తిగత స్కోరు: రోహిత్ శర్మ (97)
అత్యధిక సిక్సులు: రోహిత్ శర్మ (6), కేఎల్ రాహుల్ (6)
అత్యధిక వికెట్లు: కుల్దీప్ యాదవ్ (7)
బెస్ట్ బౌలింగ్: జహీర్ ఖాన్ ( 4/19)
ఉత్తమ ఎకానమీ రేటు: సిద్ధార్థ్ కౌల్ (2)
అత్యధిక అవుట్‌లు (కీపర్): ఎంఎస్ధోనీ (3)
అత్యధిక క్యాచ్‌లు: షేన్ థాంప్సన్ (3)
అత్యధిక భాగస్వామ్యం: రోహిత్ శర్మ / శిఖర్ ధావన్ (160)
టీమ్ అత్యధిక స్కోర్: భారత్ (213/4)
టీమ్ అత్యల్ప స్కోర్: ఐర్లాండ్ (70 ఆలౌట్)
Also Read: Regina Cassandra Pics: తెల్లటి డ్రెస్సులో.. మల్లె పువ్వులా మెరిసిపోతున్న రెజీనా కసాండ్రా!
Also Read: SL Vs AUS: అరుదైన ఘటన.. స్వదేశంలో అస్ట్రేలియాకు సపోర్ట్ చేసిన శ్రీలంక ఫాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.