Revanth Reddy Meets Bandla Ganesh: చోర్ బజార్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేసి అనూహ్యంగా వార్తల్లోకెక్కిన బండ్ల గణేష్ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కాడు.. కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి విషయంలో హాట్ కామెంట్స్ చేస్తూ రాహుల్ గాంధీకి ట్వీట్ చేసిన ఆయన ఇప్పుడు అదే రేవంత్ రెడ్డితో కలిసి ఫోటోలు దిగి వాటిని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. కొద్ది రోజుల క్రితం బండ్ల గణేష్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంతేకాక, టీపీసీసీ పదవి నుంచి ఆయనను తొలగించాలని రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. ‘పార్టీలు గెలవాలన్నా, రాజకీయం చేయాలన్నా రెడ్లకు అవకాశం, బాధ్యతలు ఇవ్వండి. రెడ్ల చేతుల్లో మీ పార్టీలను పెట్టండి’ అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడంతో బండ్ల గణేష్ అప్పట్లో ఘాటుగా స్పందించారు. ‘రాష్ట్రంలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారని, అలాంటిది రాష్ట్రాన్ని నడిపేందుకు కులతత్వం ఉన్న వ్యక్తి అనర్హుడని, రాహుల్ గాంధీ సామాజిక సూత్రం ప్రకారం రేవంత్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయాలని బండ్ల డిమాండ్ చేశారు.
రేవంత్ తన వ్యాఖ్యలతో ఇతర కులాల కాంగ్రెస్ నాయకులను అవమానించారని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శవపేటికకు రేవంత్ రెడ్డి చివరి మేకును కొట్టేశారు.,ఒక్క మాటతో కాంగ్రెస్‌ను చంపేశారని’ ట్విట్టర్ ద్వారా రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. అయితే అలాంటి బండ్ల ఇంటికి తాజాగా రేవెంత్ రెడ్డి వెళ్ళారు. బండ్ల గణేశ్ నివాసానికి వెళ్లిన రేవంత్ దాదాపు 2 గంటలపాటు ఆయనతో చర్చించారు.
యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్న గణేశ్‌ను .. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని పీసీసీ అధ్యక్షుడు కోరినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే భేటీ తర్వాత బండ్ల గణేష్ అస్క్తిఅక్రంగా స్పందించారు. రేవంత్ అన్నతో మా ఇంట్లో అద్భుతమైన సమావేశం జరిగింది, అన్నా మీ నాయకత్వంలో పని చేయడానికి ఆత్రంగా ఎదురుచూస్తున్నాము మేమంతా మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అన్నా అంటూ ఆయన పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.
Also Read:Vaani Kapoor Pics: బ్లాక్ డ్రెస్‌లో వాణీ కపూర్.. బిగుతైన ఎద అందాలు చూపిస్తూ..!
Also Read: Priyanka Jawalkar Pics: ప్రియాంక జవాల్కర్ క్లీవేజ్ షో.. నెక్ట్స్ లెవల్ అందాలతో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.