Chor Bazaar Review : ఆకాష్ పూరి 'చోర్ బజార్' రివ్యూ.. ఎలా ఉందంటే?

 AKash Puri's Chor Bazaar Review : పూరి జగన్నాథ్ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆకాష్ పూరి హీరోగా  చోర్ బజార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 24, 2022, 01:10 PM IST
Chor Bazaar Review : ఆకాష్ పూరి 'చోర్ బజార్' రివ్యూ.. ఎలా ఉందంటే?

Akash Puri's Chor Bazaar Review : పూరి జగన్నాథ్ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆకాష్ పూరి ఇప్పుడు హీరోగా నిలదొక్కుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలతో హీరోగా ప్రయత్నించి కొంత మేర సఫలమైన ఆయన తాజాగా చోర్ బజార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. గతంలో పూరి మార్క్ సినిమాలు ఎక్కువగా చేస్తూ వచ్చిన ఆకాష్ తొలి సారి తన తండ్రి మార్క్ లేకుండా పూర్తిగా బయట టీంతో ఒక సినిమా చేశాడు. సినిమా విడుదల అవుతున్న విషయం కూడా చాలా మందికి తెలియదు కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తోనే ఒక్కసారిగా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాడు ఆకాష్. మరి ఆ అంచనాలను చోర్ బజార్ సినిమా ఏ మేరకు అందుకుంది? అనేది తెలియాలంటే రివ్యూ చదవాల్సిందే. 

చోర్ బజార్ కథ
జులాయిగా తిరుగుతూ కనిపించిన కార్ టైర్లు దొంగతనం చేస్తూ వాటిని చివరి బజార్లో అమ్ముతూ జీవితం గడిపేస్తూ ఉంటాడు బచ్చన్ సాబ్(ఆకాష్ పూరి). తన ప్రాంతంలో నివాసం ఉండే సిమ్రాన్(గెహానా సిప్పీ) అనే మూగ యువతితో ప్రేమలో పడతాడు. సాదాసీదాగా సాగిపోతున్న ఆకాష్ జీవితంలోకి నిజాం వజ్రం దొంగతనం ఒక పెద్ద కుదుపు తీసుకొస్తుంది. నిజాం వజ్రం దొంగతనం కావడం అది చోర్ బజార్ కి వచ్చిందన్న విషయం తెలుసుకున్న పోలీసులు ఏం చేశారు? ఆ వజ్రాన్ని ఆకాష్ పూరి దక్కించుకున్నాడా? చివరికి ఆ వజ్రం పోలీసులకు చేరుతుందా? తమ ప్రేమను దక్కించుకోవడం కోసం ఆకాష్ ఏం చేశాడు? ఇందులో గబ్బర్ సింగ్(సుబ్బరాజు) పాత్ర ఏమిటి? హోమ్ మినిస్టర్ సునీల్ పాత్ర ఏమిటి? ఊహించకుండా ఎంట్రీ ఇచ్చిన మాంజా(సంపూర్ణేష్) పాత్ర ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ
దళం, జార్జి రెడ్డి వంటి సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు జీవన్ రెడ్డి నుంచి మొట్టమొదటిసారిగా ఒక కమర్షియల్ సినిమా వస్తుంది అనగానే ప్రేక్షకులలో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు అందుకునేందుకు జీవన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు మాత్రం పూర్తిగా సఫలం కాలేదని చెప్పాలి.  ఆయన చెప్పాలనుకున్న పాయింట్ కాస్త కొత్తగా ఉంది కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో తడబడటంతో సినిమా ఫలితమే మారిపోయిన పరిస్థితి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అవకాశాలు తక్కువయ్యాయి. ఎందుకో కానీ పూరి జగన్నాథ్ మార్క్ కొన్ని సీన్స్ లో కనిపిస్తూ ఉంటుంది. పూర్తిస్థాయి తెలంగాణ మాండలికంలో తెరకెక్కించిన ఈ సినిమా విషయంలో మరింత జాగ్రత్త పడి స్క్రీన్ ప్లే పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఉంటే సెట్ అయ్యేది. అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా కావలసిన సీన్లు మాత్రమే ఉంచి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు. 

నటీనటుల పెర్ఫార్మెన్స్ :
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో బచ్చన్ సబ్ పాత్రలో నటించిన ఆకాష్ పూరి తన గత సినిమాల కంటే మెరుగ్గా నటించారు. నటనలో కొంత మేర పరిపక్వత కనిపించింది.  మూగ అమ్మాయి పాత్ర అయినా కనిపించిన కొన్ని సీన్స్ లో తనదైన మార్కు వేసుకోవడానికి ప్రయత్నించింది గేహానా. ఆకాష్ తల్లి పాత్రలో నటించిన అలనాటి నటి అర్చన మాత్రం తెలంగాణ భాష పలకడానికి ఇబ్బంది పడడంతో కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. సుబ్బరాజు, సునీల్, సంపూర్ణేష్ బాబు వంటి వాళ్లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు అని అనుకున్నా వారి పాత్రలను ఒక పరిధి మేరకె డిజైన్ చేయడంతో తమ పరిధి మేర నటించారు.  వారి పాత్రలు ఇంకాస్త బలంగా డిజైన్ చేసుకుని ఉంటే ఇంకా మెరుగైన పర్ఫామెన్స్ లభించి ఉండేదేమో. చాలా వరకు జబర్దస్త్ లో కనిపించిన నటీనటులు సినిమాలో మెరిశారు. వారంతా తమదైన శైలిలో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

టెక్నికల్ టీం విషయానికి వస్తే
దర్శకుడు జీవన్ రెడ్డి తాను చెప్పాలనుకున్న పాయింట్ చెప్పే విషయంలో కాస్త తడబడినట్లు అర్థమైపోతుంది. ఈ నేపథ్యంలోనే సినిమా అన్ని వర్గాల వారికి కనెక్ట్ కావడం కష్టమే. పాయింట్ కొంచెం కొత్తగానే ఉన్నా ఎగ్జిక్యూషన్ బావుండి ఉంటే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేదేమో. సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం, సంగీతం కూడా సినిమాకు ప్లస్ అవుతాయి. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ కొన్ని సీన్స్ లో మెప్పించింది. అలాగే ఫక్తు కమర్షియల్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆయన సినిమాటోగ్రఫీ కనిపించింది. కథ మొత్తం ఒకే ప్రాంతంలో జరుగుతూ ఉండడంతో నిర్మాణ విలువల విషయంలో ఎక్కువగానే జాగ్రత్తలు తీసుకున్నారు నిర్మాతలు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బానే ఖర్చు పెట్టినట్లు కనిపిస్తోంది.

ఫైనల్ గా చెప్పాలంటే 
ఫైనల్ గా సినిమా విషయానికి వస్తే ఎలాంటి లాజిక్ లేకుండా చూసేవారికి చోర్ బజార్ నచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని వర్గాల వారికి నచ్చుతుంది అని చెప్పలేము, కానీ ఒకసారి చూడదగ్గ సినిమా. 

నటీనటులు :    ఆకాష్ పూరి, గెహనా సిప్పీ, సుబ్బరాజు, సునీల్, సంపూర్ణేష్‌బాబు, అర్చన, తదితరులు  
దర్శకుడు :   బి.జీవన్‌రెడ్డి 
నిర్మాత : వి.ఎస్.రాజు 
సంగీతం :  సురేష్ బొబ్బిలి 
సినిమాటోగ్రఫీ :  జగదీష్ చీకటి  

రేటింగ్: 2/5
Also Read: Neha Malik Bikini Pics: బికినీలో నేహా మాలిక్.. ఎద అందాలు ఫోకస్ చేస్తూ అరాచకం!

Also Read: RRR Movie: థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ దూసుకుపోతున్న ఆర్ఆర్ఆర్, నెట్‌ఫ్లిక్స్‌లో 45 మిలియన్ గంటల వీక్షణ రికార్డు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News